Most Awaited Film In India: సల్మాన్-షారుఖ్‌ను దాటేసిన అల్లు అర్జున్.. ఏ విషయంలో అంటే?-pushpa the rule beats pathaan and tiger 3 on list of most awaited films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pushpa The Rule Beats Pathaan And Tiger 3 On List Of Most Awaited Films

Most Awaited Film In India: సల్మాన్-షారుఖ్‌ను దాటేసిన అల్లు అర్జున్.. ఏ విషయంలో అంటే?

Maragani Govardhan HT Telugu
Oct 20, 2022 03:18 PM IST

Most Awaited Film In India: భారత్‌లో అధికంగా ఎదురుచూసే సినిమాల జాబితాలో పుష్ప 2 అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. షారుఖ్, సల్మాన్ చిత్రాల కంటే కూడా ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులు మక్కువ చూపిస్తున్నారు.

సల్మాన్-షారుఖ్ ను అధిగమించిన అల్లు అర్జున్
సల్మాన్-షారుఖ్ ను అధిగమించిన అల్లు అర్జున్

Most Awaited Film In India: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా హీరోగా అరంగేట్రం చేసినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్ని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాడు. తెలుగునాటే కాకుండా.. పుష్ప సినిమాతో పాన్ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలో దుమ్మురేపింది. ఎంతలా అంటే.. బాలీవుడ్‌లో స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చిత్రాల కంటే కూడా బన్నీ తదుపరి సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

వచ్చే ఏడాది కాలంలో బాలీవుడ్‌లో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు క్యూ కట్టాయి. ఈ చిత్రాలతో బాలీవుడ్‌లో మళ్లీ పునర్వైభవం వస్తుందనే బీటౌన్ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా రిపోర్టుల ప్రకారం ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా ఏదో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ చిత్రం హిందీ ఆడియెన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. అక్కడ స్టార్ హీరోలైన సల్మాన్, షారుఖ్ చిత్రాలకంటే అధికంటే పుష్ప 2 కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు అత్యధికంగా ఎదురుచూసే హిందీ సినిమాల జాబితాలో పుష్ప2 ముందు వరుసలో ఉంది.

ఆర్నామ్యాక్స్ మీడియా నివేదించిన నివేదిక ప్రకారం పుష్ప-2కు క్రేజ్ దేశవ్యాప్తంగా నెలకొందని పేర్కొంది. ముఖ్యంగా హిందీ ఆడియెన్స్ విషయంలో ఇది కొంచెం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. డిసెంబరు 2022 నుంచి విడుదలయ్యే చిత్రాలను మాత్రమే ఈ జాబితాలో సంస్థ పరిగణించింది. వాటి ట్రైలర్లను ఇంకా విడుదల కాలేదు. ఆసక్తికర విషయమేమంటే పుష్ప 2 చిత్రం హిందీ సినిమా కానప్పటికీ.. ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురచూస్తున్నారు. దీని తర్వాత షారుఖ్ నటించిన పఠాన్ రెండో స్థానంలో ఉంది. సల్మాన్ నటిస్తోన్న టైగర్3 మూడో స్థానంలో ఉంది. అయితే టాప్-5లో మూడు సినిమాలు షారుఖ్ చిత్రాలు కావడం విశేషం. ఆయన నటిస్తోన్న జవాన్, డుంకీ కూడా వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచాయి.

దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. స్టైలిష్ స్టార్ పాన్ఇండియా స్టార్‌డమ్‌కు ఇదే నిదర్శనమని, అత్యంత ఫాలోయింగ్ ఉన్న ఖాన్‌లను సైతం వెనక్కి నెట్టడం అల్లు అర్జున్‌కే సాధ్యమైందని స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభైంది. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోపక్క పఠాన్‌లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తుండగా.. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2023 జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. సల్మాన్ నటిస్తోన్న టైగర్-3లో కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో షారుఖ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం