Puri Jagannadh on JGM Movie: లైగర్ రిజల్ట్‌తో అయోమయంలో పూరి.. జేజీఎం నిలిపివేసినట్లేనా?-puri jagannadh wise decision to puts jgm on hold amid liger amid liger disaster result ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Puri Jagannadh Wise Decision To Puts Jgm On Hold Amid Liger Amid Liger Disaster Result

Puri Jagannadh on JGM Movie: లైగర్ రిజల్ట్‌తో అయోమయంలో పూరి.. జేజీఎం నిలిపివేసినట్లేనా?

Maragani Govardhan HT Telugu
Sep 04, 2022 09:49 AM IST

Puri Jagannadh hold JGM Movie: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన తన తర్వాత చిత్రాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫిల్మ్ వర్గాల సమచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రం జేజీఎం తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

జేజీఎం
జేజీఎం (Twitter)

Puri Jagannadh hold JGM Movie: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రం గత నెలలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దెబ్బకు ఆయన తన తర్వాత ప్రాజెక్టులపై ఆచి తూచి వ్యవహరించనున్నారు. విజయ్ దేవరకొండ లాంటి హీరోతో ఇలాంటి ఔట్ డేటెడ్ స్టోరీ తీయడమేంటి? అని ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో పూరి ఆలోచనల్లో పడ్డారని ఫిల్మ్ వర్గాల సమాచారం. లైగర్ సినిమా విడుదలకు ముందే మళ్లీ విజయ్‌నే హీరోగా జేజీఎం ప్రకటించారు ఈ దర్శకుడు.

అయితే లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదలై ఘోరంగా పరాజయం పాలైంది. ఈ చిత్రంపై విమర్శకుల సైతం నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రం జేజీఎం(జనగణమన) చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలను తాత్కలికంగా నిలిపివేశారని సన్నిహిత వర్గాల సమాచారం. లైగర్ కంటే ముందే జేజీఎం చిత్రాన్ని విజయ్‌తో తీసేందుకు ఘనంగా లాంచ్ చేసింది పూరి టీమ్. అయితే లైగర్ ఫలితం ఆయనను తాత్కాలికంగా జేజీఎం నిలిపివేసేటట్లు చేసింది.

సినిమా విశ్లేషకులు మాత్రం పూరి జగన్నాథ్ జేజీఎం‌ను నిలిపివేయడం తెలివైన పనే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని కొన్ని రోజుల పాటు నిలిపివేయడం మంచిదే అని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆ చిత్రాన్ని పట్టాలెక్కించినట్లయితే లైగర్ ఫలితం ప్రభావం ఆ సినిమాపై పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జేజీఎం చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినున్నారు. లైగర్ ఫలితం కారణంగా పూరి తన టీమ్‌తో చర్చించి ఈ సినిమాను తాత్కలికంగా నిలిపివేశారు. మరోపక్క లైగర్ పరాజయంతో ఘోరంగా నష్టాలు చవిచూసిన చిత్ర కొనుగోలుదారులు, డిస్ట్రిబ్యూటర్లతో పూరి జగన్నాథ్ త్వరలోనే సమావేశం నిర్వహించనున్ట్ల్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఆగస్టు 25న విడుదలైంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్‌ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్‌ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం