Telugu News  /  Entertainment  /  Prithviraj Sukumaran Wife Supriya Visits Salaar Movie Sets
ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas Salaar Movie: స‌లార్ అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేస్తుంది - పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ వైఫ్ పోస్ట్ వైర‌ల్‌

19 November 2022, 16:05 ISTNelki Naresh Kumar
19 November 2022, 16:05 IST

Prabhas Salaar Movie: ప్ర‌భాస్ స‌లార్ సినిమా అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేస్తోంద‌ని మ‌ల‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకు మార‌న్ వైఫ్ సుప్రియా మీన‌న్ పేర్కొన్న‌ది. స‌లార్ గురించి సుప్రియా మీన‌న్ చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Prabhas Salaar Movie: ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌లార్ సినిమాపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాపై మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ వైఫ్ సుప్రియామీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. స‌లార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. వ‌ర‌ద‌రాజా మ‌న్నార్ అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్ పోషిస్తోన్నాడు. పృథ్వీరాజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇటీవ‌లే అత‌డి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

స‌లార్ సినిమా సెట్స్‌ను పృథ్వీరాజ్ సుకుమార‌న్ వైఫ్ సుప్రియామీన‌న్ ఇటీవ‌లే సంద‌ర్శించింది. ఈ షూటింగ్ తాలూకు అనుభ‌వాల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది. ప్ర‌శాంత్ నీల్ సినిమాను తెర‌కెక్కిస్తోన్న తీరు చూస్తుంటే స‌లార్ అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేసేలా క‌నిపిస్తోంద‌ని చెప్పింది. అద్భుత‌మైన సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన వ్య‌క్తులు ప‌నితీరును ద‌గ్గ‌ర నుంచి చూసే అవ‌కాశం ద‌క్క‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపింది.

సినిమా కోసం ప్ర‌శాంత్ నీల్ ప‌డుతోన్న క‌ష్టం, త‌న విజ‌న్‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తోన్న తీరు అమోఘంగా అనిపించాయ‌ని పేర్కొన్న‌ది. ఈ సినిమా సెట్స్‌ను సంద‌ర్శించ‌డం చాలా సంతోషాన్ని క‌లిగించింద‌ని పేర్కొన్న‌ది. సుప్రియా మీన‌న్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సుప్రియా పోస్ట్‌ను ప్ర‌భాస్ అభిమానులు తెగ షేర్ చేస్తోన్నారు.

ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా స‌లార్ సినిమా తెర‌కెక్కుతోంది. దాదాపు 200 కోట్ల వ్య‌యంతో కేజీఎఫ్ ఫేమ్ విజ‌య్ కిర‌గందూర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. శృతిహాస‌న్, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌లార్‌తో పాటు ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ సినిమాల‌తో పాటుగా ద‌ర్శ‌కుడు మారుతితో ఓ సినిమా చేయ‌బోతున్నారు.