Sir Movie Pre Release Event: సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?-pawan kalyan to grace dhanush sir movie pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pawan Kalyan To Grace Dhanush Sir Movie Pre Release Event

Sir Movie Pre Release Event: సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

Nelki Naresh Kumar HT Telugu
Feb 10, 2023 11:21 PM IST

Sir Movie Pre Release Event: ధ‌నుష్ హీరోగా న‌టించిన సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్ర‌వ‌రి 14న హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ వేడుక‌కు ఎవ‌రు గెస్ట్‌గా రానున్నారంటే...

ధ‌నుష్‌, సంయుక్త మీన‌న్‌
ధ‌నుష్‌, సంయుక్త మీన‌న్‌

Sir Movie Pre Release Event: ధ‌నుష్ హీరోగా న‌టించిన సార్ మూవీ ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ కానుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందిన ఈ బైలింగ్వ‌ల్ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్ర‌వ‌రి 14న హైద‌రాబాద్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెస్ట్‌గా హాజ‌రుకాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయిసౌజ‌న్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్ర‌మ్‌తో పాటు నిర్మాణ సంస్థ‌తో ఉన్న‌ అనుబంధంతోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఈ వేడుక‌కు గెస్ట్‌గా హాజ‌రుకాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు త్రివిక్ర‌మ్ కూడా ఈ వేడుక‌లో పాల్గొనన్న‌ట్లు స‌మాచారం. విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఆవిష్క‌రిస్తూ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. సార్ సినిమాలో ధ‌నుష్‌కు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా న‌టిస్తున్నాడు. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తోన్న ఈసినిమా త‌మిళంలో వాతి పేరుతో రిలీజ్ కానుంది.

IPL_Entry_Point