Nayanthara and Vignesh Shivan with Babies: చేతుల్లో బిడ్డలతో నయన్‌, విగ్నేష్‌ దీపావళి శుభాకాంక్షలు-nayanthara and vignesh shivan with babies wish happy diwali ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nayanthara And Vignesh Shivan With Babies Wish Happy Diwali

Nayanthara and Vignesh Shivan with Babies: చేతుల్లో బిడ్డలతో నయన్‌, విగ్నేష్‌ దీపావళి శుభాకాంక్షలు

HT Telugu Desk HT Telugu
Oct 24, 2022 06:54 PM IST

Nayanthara and Vignesh Shivan with Babies: చేతుల్లో బిడ్డలతో నయనతార, విగ్నేష్‌ శివన్‌ దంపతులు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. సోమవారం (అక్టోబర్‌ 24) వాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్‌ చేశారు.

తమ కవల పిల్లలతో నయనతార, విగ్నేష్ శివన్
తమ కవల పిల్లలతో నయనతార, విగ్నేష్ శివన్ (Vignesh Instagram)

Nayanthara and Vignesh Shivan with Babies: నయన్‌, విగ్నేష్‌ మరోసారి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ మధ్యే తాము కవలలకు తల్లిదండ్రులమయ్యామని చెప్పి ఆశ్చర్యపరిచిన ఈ జంట.. తాజాగా ఆ బిడ్డలను ఎత్తుకొని దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. సరోగసీ ద్వారా నయన్‌, విగ్నేష్‌ ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

వీళ్లకు ఉయిర్‌, ఉలగమ్‌ అనే పేర్లు పెట్టారు. సోమవారం (అక్టోబర్‌ 24) దీపావళి సందర్భంగా తమ ఇద్దరు బిడ్డలకు ఎత్తుకున్న ఈ జంట వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. విగ్నేష్‌ ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.

"అందరికీ హ్యాపీ దివాలీ. ఏ రకంగా చూసినా ఇది మాకు పెద్ద దివాలీ. హ్యాపీ హ్యాపీ దివాలీ అందరికీ. జీవితం మీకు విసిరే అన్ని అడ్డంకులను తట్టుకొని మీరు ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నా. అందరికీ పంచడానికి మా దగ్గర ప్రేమే ఉంది. ప్రేమే జీవితాన్ని అందంగా, సుసంపన్నంగా మారుస్తుంది. దేవుడిని విశ్వసించండి. నమ్మకాన్ని విశ్వసించండి" అంటూ విగ్నేష్‌ ఈ వీడియోను షేర్‌ చేశాడు.

ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్న నయన్‌, విగ్నేష్‌.. అక్టోబర్‌లోనే తమకు కవల పిల్లలు పుట్టారని అనౌన్స్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇది సరోగసీ ద్వారా అని తేలడంతో వివాదం తలెత్తింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా వివరణ అడగటంతో.. తాము ఆరేళ్ల కిందటే రిజిస్టర్‌ వివాహం చేసుకున్నామని, అన్ని సరోగసీ నిబంధనలను పాటించామని వాళ్లు వివరణ ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార ఈ మధ్యే గాడ్‌ఫాదర్‌ మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత మలయాళంలో పృథ్వీరాజ్‌తో గోల్డ్‌, హిందీలో షారుక్‌ ఖాన్‌తో జవాన్‌ మూవీలు చేస్తోంది. ఇక అటు విగ్నేష్‌ శివన్‌ తన తర్వాతి సినిమాను అజిత్‌తో చేయనున్నాడు.

IPL_Entry_Point