Nayan and Vignesh Surrogacy Issue: సరోగసి వివాదంపై నయన్-విఘ్నేశ్ క్లారిటీ.. ఆసక్తికర పోస్ట్-vignesh shivan says be patient in new post amid surrogacy issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayan And Vignesh Surrogacy Issue: సరోగసి వివాదంపై నయన్-విఘ్నేశ్ క్లారిటీ.. ఆసక్తికర పోస్ట్

Nayan and Vignesh Surrogacy Issue: సరోగసి వివాదంపై నయన్-విఘ్నేశ్ క్లారిటీ.. ఆసక్తికర పోస్ట్

Maragani Govardhan HT Telugu
Oct 12, 2022 12:42 PM IST

Surrogacy Issue: సరోగసి విధానం ద్వారా నయనతార-విఘ్నేశ్ శివన్ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం చర్చనీయాంశమవుతున్న తరుణంలో విఘ్నేశ్ తన పోస్టుతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నయనతార-విఘ్నేశ్ శివన్
నయనతార-విఘ్నేశ్ శివన్ (Twitter)

Nayan and Vignesh Surrogacy Issue: ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఈ ఏడాది వివాహంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అసల వివాదం ఇప్పుడే మొదలైంది. నయన్-విఘ్నేశ్ జూన్ 9న కుటుంబ సభ్యలు సమక్షంలో వివాహం చేసుకోగా.. ఈ తంతు జరిగి నాలుగు నెలలకే సరోగసి పద్ధతిలో కవలలు జన్మించడంతో నెటిజన్లు వీరిపై సీరియస్ అవుతున్నారు.

మనదేశంలో ఈ విధానంలో పిల్లలకు జన్మనివ్వడాన్ని నిషేధించారు. ఆ చట్టం ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చింది. ఈ కారణంగా చట్టాన్ని అతిక్రమించారంటూ నెటిజన్లు నయన్-విఘ్నేశ్‌పై ఫైర్ అవుతున్నారు. అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. వీటిపై ఈ జంట ఇంకా స్పందించలేదు. తాజాగా విఘ్నేశ్ శివన్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ రూపంలో ఈ అంశంపై క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు.

“అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అంతవరకు ఓపికపట్టండి.. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి” అంటూ స్టోరీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులుగా మారిన నయన్ దంపతులు ఈ విషయంపై నేరుగా స్పందించేందుకు ఇష్టపడట్లేదని తెలుస్తోంది.

గత ఆరేళ్లుగా నయన్-విఘ్నేశ్ ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్ 9న వీరిద్దరూ మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి షారుఖ్, రజినీకాంత్, ఏఆర్ రెహమాన్, జ్యోతిక, సూర్య తదితరులు హాజరయ్యారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్‌ఫాదర్ సినిమాలో నటించింది నయన్.

IPL_Entry_Point

సంబంధిత కథనం