Naveen Polishetty Anushka Shetty Movie: దేవసేనా.. నీ మనసులో ఉన్నది నేనేనా.. అనుష్కతో నవీన్ సరసాలు-naveen polishetty anushka shetty movie title announcement on wednesday march 1st ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naveen Polishetty Anushka Shetty Movie: దేవసేనా.. నీ మనసులో ఉన్నది నేనేనా.. అనుష్కతో నవీన్ సరసాలు

Naveen Polishetty Anushka Shetty Movie: దేవసేనా.. నీ మనసులో ఉన్నది నేనేనా.. అనుష్కతో నవీన్ సరసాలు

Hari Prasad S HT Telugu
Feb 28, 2023 09:27 PM IST

Naveen Polishetty Anushka Shetty Movie: దేవసేనా.. నీ మనసులో ఉన్నది నేనేనా.. అంటూ అనుష్క శెట్టితో నవీన్ పోలిశెట్టి సరసాలు ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటీ వీడియో.. మీరే చూడండి.

నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి

Naveen Polishetty Anushka Shetty Movie: నవీన్ పోలిశెట్టి తెలుసు కదా. టాలీవుడ్ లో ఎంతో టాలెంట్ ఉన్న నటుడు. పర్ఫెక్ట్ టైమింగ్ కామెడీతో ఆకట్టుకుంటాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీలో కామెడీతోపాటు గుండెను పిండేసే ఎమోషన్ తోనూ అతడు ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జాతి రత్నాలు మూవీతో మరోసారి కితకితలు పెట్టాడు.

ఇక ఇప్పుడు ఏకంగా అనుష్క శెట్టితో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మేకర్స్ మంగళవారం (ఫిబ్రవరి 28) ఓ ఇంట్రెస్టింగ్, ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నవీన్ పోలిశెట్టి.. అనుష్కతో సరసాలు ఆడుతుంటాడు. నిజానికి నేరుగా అనుష్కతో కాదు కానీ ముందు ఆమె పోస్టర్ పెట్టుకొని మాట్లాడుతుంటాడు. మనం కలిసి సినిమా చేస్తున్నాం కదా.. ఇప్పుడా మూవీకి టైటిల్ పెట్టే సమయం వచ్చింది.. ఏ టైటిల్ అయితే బాగుంటుందో చెప్పు అంటూ నవీన్ అడుగుతాడు.

కొన్ని అదిరిపోయే టైటిల్స్ వస్తున్నాయని, ఇందులో ఏది బాగుంటుందో చెప్పమంటాడు. దేవసేనా.. నీ మనసులో ఉన్నది నేనేనా.. స్వీటీతో ఎవడీ క్యూటీ అంటూ కొన్ని ఫన్నీ టైటిల్స్ చెప్పి మురిసిపోతాడు. నిజానికి ఈ మూవీ టైటిల్ ను బుధవారం (మార్చి 1) అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ ఫన్నీ వీడియోతో ఆ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.

మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ విషయాన్ని కూడా మేకర్స్ ఇలా ఓ వెరైటీ వీడియోతో అనౌన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిజానికి నవీన్, అనుష్క కలిసి సినిమా చేస్తున్నారన్న వార్తే చాలా ఆసక్తి రేపింది. ఇప్పుడీ మూవీకి ఓ ఫన్నీ టైటిల్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాను మహేష్ బాబు పీ డైరెక్ట్ చేస్తుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Whats_app_banner