Custody vs Agent: ఏజెంట్ కంటే ముందుగానే ఓటీటీలోకి నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ - స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ ఏదంటే-naga chaitanya custody ott streaming platform and date fixed custody ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Naga Chaitanya Custody Ott Streaming Platform And Date Fixed Custody Ott Release Date

Custody vs Agent: ఏజెంట్ కంటే ముందుగానే ఓటీటీలోకి నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ - స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ ఏదంటే

HT Telugu Desk HT Telugu
Jun 05, 2023 10:54 AM IST

Custody vs Agent: అఖిల్ ఏజెంట్ కంటే ముందుగానే నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే....

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య

Custody vs Agent: నాగ‌చైత‌న్య(Naga Chaitanya) క‌స్ట‌డీ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. అఖిల్ ఏజెంట్ త‌ర్వాతే థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అఖిల్ (Akhil Akkineni) మూవీకంటే ముందుగానే స్ట్రీమింగ్‌ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన క‌స్ట‌డీ సినిమాకు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

భారీ అంచ‌నాల‌తో మే 12న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. కాగా ఈ సినిమా జూన్ 9 లేదా 16 తేదీల‌లో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లుతెలిసింది. ఈ రెండు డేట్‌ల‌లో ఏద‌న్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

క‌స్ట‌డీ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. దాదాపు ఎనిమిది కోట్ల‌కు తెలుగుతో పాటు త‌మిళ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. రెండు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది.

కానిస్టేబుల్ శివ‌...

ఈ సినిమాలో శివ అనే పోలీస్ కానిస్టేబుల్‌గా నాగ‌చైత‌న్య క‌నిపించాడు. ముఖ్య‌మంత్రి అండ‌తో ఎన్నో నేరాల‌కు పాల్ప‌డిన రాజు అనే క్రిమిన‌ల్‌ను కోర్టులో హాజ‌రుప‌రిచే బాధ్య‌త‌ను చేప‌ట్టిన ఓ కానిస్టేబుల్‌కు ఎదురైన సంఘ‌ట‌న‌ల‌తో యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు వెంక‌ట్ ప్ర‌భు.

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా ఎంగేజింగ్‌గా చెప్ప‌డంలో త‌డ‌బ‌డ‌టంతో క‌స్ట‌డీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. అర‌వింద్ స్వామి, ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమాతోనే కోలీవుడ్‌లో పాగా వేయాల‌న్న నాగ‌చైత‌న్య ఆశ‌లు తీర‌లేదు.

దాదాపు ఇర‌వై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ప‌ది కోట్లు కూడా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది. నిర్మాత‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

IPL_Entry_Point

టాపిక్