Kriti Sanon offers dupatta to Prabhas: ప్రభాస్‌కు చెమటలు పడుతుంటే.. కృతి సనన్ ఏం చేసిందో చూడండి!
Kriti Sanon offers dupatta to Prabhas: ప్రభాస్, కృతి సనన్ మధ్య స్క్రీన్‌పైనే కాదు బయట కూడా కెమెస్ట్రీ అదిరిందని అంటున్నారు లేటెస్ట్‌గా బయటకు వచ్చిన ఓ వీడియో చూసిన అభిమానులు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? అందులో ఏముంది?
Kriti Sanon offers dupatta to Prabhas: టాలీవుడ్‌లో అప్పుడెప్పుడో మహేష్ బాబుతో కలిసి వన్ నేనొక్కిడినే మూవీలో నటించింది బాలీవుడ్ భామ కృతి సనన్. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్‌తో కలిసి పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌లో యాక్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఎంతగానో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా టీజర్ ఆదివారం (అక్టోబర్ 2) గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
నిజానికి ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులు ఆశించినట్లుగా లేవు. వీటిపై ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ నడుస్తున్నాయి. అయితే టీజర్ రిలీజ్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోలు మాత్రం ఫ్యాన్స్‌కు బాగా నచ్చేశాయి. ముఖ్యంగా ఈ మూవీలో రాముడు, సీతగా నటించిన ప్రభాస్, కృతి సనన్ రియల్ లైఫ్‌లో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో టీజర్ రిలీజ్‌లో అందరి కళ్లూ వీళ్లపైనే ఉన్నాయి.
ప్రభాస్‌కు దుపట్టా ఇచ్చిన కృతి
ఇలాంటి బడా వేడుకల్లో కాస్త ఇబ్బందిగా ఫీలయ్యే అలవాటు ప్రభాస్‌కు ఉంది. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ సందర్భంగా కూడా అతడు అలాగే కనిపించాడు. చెమటలు కూడా పట్టాయి. తన చేత్తో నుదిటిపై చెమటలు తుడుచుకుంటున్న ప్రభాస్‌కు పక్కనే ఉన్న కృతి సనన్ తన దుపట్టా ఆఫర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె కాస్త సిగ్గు పడుతూ దుపట్టాను ఇవ్వాలని ప్రయత్నించడం ఇందులో చూడొచ్చు.
ఇది ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. మరో ఫొటోలో ప్రభాస్, కృతి చేతిలో చేయి వేసి నడుస్తున్నట్లుగా ఉంది. ఇది చూసిన ఫ్యాన్స్.. ప్రభాస్ చేతిని ఎప్పటికీ ఇలా పట్టుకో అన్నట్లుగా కామెంట్స్ చేశారు. స్టేజ్‌పై ఇద్దరూ ఒకరినొకరు తరచూ చూసుకోవడం, నవ్వుకోవడం.. ఇలా నిజంగా ఇద్దరి మధ్యా ఏదో ఉంది అన్నట్లుగానే వ్యవహరించారు. చాలా రోజుల పాటు ప్రభాస్, అనుష్కపై వినిపించిన పుకార్లు ఇప్పుడు ప్రభాస్, కృతి పైకి మళ్లాయి.
ఇక ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించాడు. తన్హాజీ మూవీతో పేరు సంపాదించిన ఓం రౌత్ ఈ ఆదిపురుష్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ ఆదిపురుష్ మూవీని నిర్మిస్తున్నారు.