Prabhas Dating with Kriti: కృతితో ప్రభాస్ డేటింగ్.. ఆదిపురుష్ సెట్స్‌లో హీరోయిన్‌తో డార్లింగ్ క్లోజ్..!-according to bollywood sources prabhas dating with kriti sanon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  According To Bollywood Sources Prabhas Dating With Kriti Sanon

Prabhas Dating with Kriti: కృతితో ప్రభాస్ డేటింగ్.. ఆదిపురుష్ సెట్స్‌లో హీరోయిన్‌తో డార్లింగ్ క్లోజ్..!

Maragani Govardhan HT Telugu
Sep 20, 2022 11:55 AM IST

Prabhas And Kriti Sanon in Relation: ఆదిపురుష్ నటులు ప్రభాస్, కృతి సనన్ డేటింగ్‌లో ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. వీరిద్దరు ఒకరినొకరు బలమైన ఫీలింగ్స్ కలిగి ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్-కృతి సనన్
ప్రభాస్-కృతి సనన్ (Twitter)

Prabhas has Strong Feeling on Kriti Sanon: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ తన వ్యక్తిగత జీవితం చాలా గోప్యంగా ఉంచుతాడు. అయితే అనుష్క శెట్టితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని గతంలో వార్తలు వచ్చినప్పటికీ.. ఇరువురు మేము ఫ్రెండ్స్ మాత్రమే ఆ ఊహాగానాలను కొట్టి పారేశారు. నాలుగు పదుల వయస్సు దాటినా ఇంత వరకు పెళ్లి చేసుకోని మన డార్లింగ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆత్రుతతో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం ప్రభాస్.. ఆదిపురుష్‌లో తన సహచర నటి కృతి సనన్‌తో డేటింగ్ చేస్తున్నాడని సమాచారం.

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కృతి సనన్.. ఫొన్ సిగ్మెంట్‌లో భాగంగా ప్రభాస్‌కు ఫోన్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంపై తర్వాత ఇద్దరూ స్పందించకపోయినప్పటికీ.. ప్రభాస్, కృతి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వినిపించాయి. బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభాస్, కృతి ఇద్దరూ ఒకరినొకరు స్ట్రాంగ్ ఫీలింగ్స్ కలిగి ఉన్నారని, ఆదిపురుష్ సెట్స్‌లో వీరిద్దరూ క్లోజ్ అయ్యారని సమాచారం. స్వతహాగా ఎక్కువగా సిగ్గు పడే ప్రభాస్.. కృతి సనన్‌తో ఓపెన్‌గా మాట్లాడటం, ఎక్కువ సేపు ఆమెతో ముచ్చటించడం ఈ వార్తలకు బలాన్నిస్తుంది.

దీంతో వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రత్యేక బంధంగా మారుతుందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. అయితే అధికారికంగా తమ బంధం గురించి చెప్పడాని కంటే ముందే సర్వత్రా వీరి అంశం చర్చనీయాంశంమైంది. నెలల క్రితమే ఆదిపురుష్ షూటింగ్ ముగిసినప్పటికీ.. వీరి బంధం ఇప్పటికీ చెక్కు చెదరలేదట, ఒకరికొకరు ఇప్పటికే ఫోన్, మెసేజుల రూపంలో టచ్ ఉన్నారట. దీంతో పరస్ఫరం ఒకరిపై మరొకరు అభిమానాన్ని కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఓ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లపై ఇలాంటి వార్తలు రావడం సహజమే.. కానీ ప్రభాస్-కృతి విషయంలో ఈ వ్యవహారం కాస్త భిన్నంగా ఉందని, ఒకరినొకరు నిజంగా ఇష్టపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

గతేడాది ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. అతడు మొదట్లో చాలా సిగ్గు పడేవాడని, తను మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత.. అతడిని ఆపలేకపోయామని చెప్పింది. అంతేకాకుండా ప్రభాస్ మంచి భోజన ప్రియుడని కూడా స్పష్టం చేసింది.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం