Trolls on Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్‌పై ఫ్యాన్స్ ట్రోల్స్ - కార్టూన్ సినిమా అంటూ కామెంట్స్
Trolls on Adipurush Teaser: ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలైంది. ఈ టీజర్‌లో ప్రభాస్ లుక్, విజువల్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు ఓంరౌత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Trolls on Adipurush Teaser: ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియన్ స్థాయిలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. రామాయణ గాథ ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ (Omraut) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆదివారం అయోధ్యలో ఆదిపురుష్ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. కాగా ఈ టీజర్‌పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను రూపొందించాడు. ఇందులో ప్రభాస్ లుక్ సరిగా లేకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పూర్తిగా యానిమేషన్ లా అతడి క్యారెక్టర్‌ను డిజన్ చేయడం బాగాలేదని చెబుతున్నారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్, జానకిగా కృతిసనన్ (Krithi sanon)పూర్తిగా మోడ్రన్ స్టైల్‌లో టీజర్‌లో కనిపించారు. వారి లుక్, గెటప్‌ల విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సినిమాలోని యానిమేషన్స్ కూడా కార్టూన్స్ స్థాయిలో ఉన్నాయంటూ విజువల్స్ బాగాలేవంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కార్టూన్ ఛానెల్ కోసం చేసిన సినిమాలా ఉందంటూ, 500 కోట్ల బడ్జెట్ ఎక్కడ కనిపించడం లేదని చేస్తున్న ట్వీట్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓంరౌత్‌ను ఆడుకుంటున్నారు. అతడిని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
రజనీకాంత్ (Rajinikanth)కొచ్చాడయాన్‌తో ఆదిపురుష్ సినిమాను కంపేర్ చేస్తున్నారు. ఆదిపురుష్‌తో పోలిస్తే కొచ్చాడయన్ ఎన్నో రెట్లు బెటర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా జానకిగా కృతిసనన్ నటిస్తోంది. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ చేస్తున్నాడు.
సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తానాజీ తర్వాత ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.