Prabhas Adipurush Teaser: భూమి కృంగినా నింగి చీలినా వస్తున్నా - ఆది పురుష్ టీజర్ రిలీజ్
Prabhas Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. విజువల్ విండర్‌గా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయోధ్యలో ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
Prabhas Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్‌తో అభిమానుల్లో ఆనందాన్ని నింపారు ప్రభాస్. ఆదివారం అయోధ్యలో ఈ టీజర్‌ను విడుదలచేశారు. ఈ టీజర్‌లో సముద్రం ఆడుగున తపస్సు చేసుకుంటూ ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. భూమి కృంగినా నింగి చీలినా న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది.
వస్తున్నా న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి అంటూ రావణుడితో పోరు సాగించడానికి సిద్ధమైనట్లుగా ప్రభాస్ చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. రాముడిగా ప్రభాస్ లుక్, గెటప్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ (Saif ali khan) క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా టీజర్‌లో కనిపిస్తోంది. విజువల్ వండర్‌గా టీజర్‌ను తీర్చిదిద్దారు.
రాముడిగా గెటప్‌లో ప్రభాస్ (Prabhas)రాక్షసులతో పోరాడే యాక్షన్ సీన్స్ , లంకలో హనుమంతుడు సృష్టించిన విధ్యంసం టీజర్‌లో అలరిస్తున్నాయి. చివరలో జై శ్రీరామ్ అంటూ వచ్చే పాట, బీజీఎమ్ ఆకట్టుకుంటున్నాయి. అయోధ్యలో జరుగుతున్న ఈ టీజర్ రిలీజ్ వేడుకలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, దర్శకుడు ఓంరౌత్‌తో(Omraut) పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
చెడుకు ప్రతీకగా నిలిచిన లంకేష్ అనే రాక్షసుడిని ఎదుర్కొనేందుకు రాముడు సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో ఓం రౌత్ చూపించబోతున్నాడు. దాదాపు ఐదు వందల కోట్ల వ్యయంతో ఆదిపురుష్ రూపొందుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి.
టీజర్ రిలీజ్ వేడుక నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.
మోషన్ క్యాప్చర్ త్రీడీతో పాటు ఐమాక్స్ ఫార్మెట్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది.