Sardar Trailer Release Date: సర్దార్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?-karthi new movie sardar trailer release date fix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Karthi New Movie Sardar Trailer Release Date Fix

Sardar Trailer Release Date: సర్దార్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Oct 13, 2022 07:02 PM IST

Sardar Trailer Release Date: కోలీవుడ్ హీరో కార్తి నటించిన తాజా చిత్రం సర్దార్. ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో కార్తి సరసన రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.

సర్దార్ ట్రైలర్ విడుదల
సర్దార్ ట్రైలర్ విడుదల (Twitter)

Sardar Trailer Release Date: కోలీవుడ్ హీరో కార్తి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఈ ఏడాది ఇప్పటికే విరుమాన్, పొన్నియిన్ సెల్వన్-1 చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే సర్దార్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ఆడియెన్స్‌లో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సర్దార్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

సర్దార్ ట్రైలర్‌ను శుక్రవారం అక్టోబరు 14ల తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, రజీషా విజయన్‌లు హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో కార్తీ ఓ గూఢచారి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇందులో ఏకంగా ఆరు డిఫరెంట్ గెటప్స్‌లో కార్తీ అదరగొట్టాడు.

పీఎస్‌ మిత్రన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నటి తరం హీరోయిన్ లైలా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. ఈమెతో పాటు చుంకీ పాండే, ప్రిన్స్, మునీశ్ కాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున కొనుగోలు చేశాడు. కార్తీకి.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అతడు నటించిన సినిమాలు ఇక్కడ కూడా అనువాదమై మంచి వసూళ్లు సాధిస్తాయి. అందుకే బడా నిర్మాతలు అతని సినిమా హక్కులను కొనుగోలు చేసి ఇక్కడ విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. సర్దార్‌ మూవీ కోసం కూడా ఎంతో మంది పోటీ పడినా.. నాగార్జునే దక్కించుకున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం