Janhvi Kapoor Remuneration: ఎన్టీఆర్30 కోసం జాన్వీ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?-janhvi kapoor remuneration for ntr30 revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Janhvi Kapoor Remuneration For Ntr30 Revealed

Janhvi Kapoor Remuneration: ఎన్టీఆర్30 కోసం జాన్వీ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Hari Prasad S HT Telugu
Apr 24, 2023 09:59 PM IST

Janhvi Kapoor Remuneration: ఎన్టీఆర్30 కోసం జాన్వీ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అప్పట్లో ప్రభాస్ సాహోలో నటించడానికి మరో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ అందుకున్న మొత్తమే జాన్వీ అందుకుంటోంది.

ఈ మధ్యే జరిగిన పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌ల‌పై క్లాప్‌ ఇస్తోన్న రాజ‌మౌళి
ఈ మధ్యే జరిగిన పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌ల‌పై క్లాప్‌ ఇస్తోన్న రాజ‌మౌళి

Janhvi Kapoor Remuneration: ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన నటి శ్రీదేవి. ఇక్కడి నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా ఓ వెలుగు వెలిగింది. అయితే మొత్తానికి ఆమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. ఎన్టీఆర్30 మూవీలో తారక్ సరసన జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ లు అందుకునే ఈ భామలు టాలీవుడ్ లోనూ అదే స్థాయిలో డిమాండ్ చేయడం సహజం. అందుకు తగినట్లే ఈ ఎన్టీఆర్30 కోసం జాన్వీ కూడా భారీ మొత్తం అందుకోనున్నట్లు ఈటీటైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. నిజానికి ఈ మూవీ కోసం జాన్వీకి రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. కానీ దానికి మరో కోటి జోడించి రూ.5 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

నిజానికి గతంలో ప్రభాస్ నటించిన సాహో మూవీలో అతని సరసన కనిపించిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది. ఈ మూవీ కోసం మొదట కత్రినా కైఫ్ ను అనుకున్నా.. ఆమె ఏకంగా రూ.7 కోట్లు డిమాండ్ చేయడంతో తర్వాత శ్రద్ధాను ఫైనల్ చేశారు. అయితే ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

ఇక ధడక్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ.. తర్వాత రూహి, గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలీలాంటి సినిమాల్లో నటించింది. ఈ మిలీ మూవీలో ఆమె నటనకు ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి. అందంతోపాటు నటనలోనూ తన తల్లి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తున్న జాన్వీ.. టాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.

తారక్ తో కలిసి నటించాలని ఉన్నట్లు గతంలోనూ జాన్వీ చెప్పింది. ఎన్టీఆర్30లో జాన్వీతోపాటు మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అతడు విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ మధ్యే అతడు ఎన్టీఆర్ 30 సెట్స్ లో అడుగుపెట్టాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం