Rana Naidu in OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన రానా నాయుడు.. ఆలస్యంగా స్ట్రీమింగ్-finally rana naidu available in ott and streaming in netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Finally Rana Naidu Available In Ott And Streaming In Netflix

Rana Naidu in OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన రానా నాయుడు.. ఆలస్యంగా స్ట్రీమింగ్

Maragani Govardhan HT Telugu
Mar 10, 2023 03:39 PM IST

Rana Naidu in OTT: రానా, వెంకటేష్ కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఎట్టకేలకు ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిందీ సిరీస్.

రానా నాయుడు
రానా నాయుడు (MINT_PRINT)

Rana Naidu in OTT: విక్టరి వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనావన్‌ను ఇండియన్ అడాప్షన్‍‌గా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ సిరీస్‌ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆలస్యంగా ఈ సిరీస్ విడుదలైంది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ మొదటి నుంచి చెప్పడంతో గురువారం అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత కానీ ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కాలేదు.

రానా, వెంకటేష్ కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ కావడంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ వీడియోలకు అంచనాలు బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఈ సిరీస్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ షోను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేష్.. ఇంట్లోనే సిరీస్‌ను చూసి అందరూ ఆదరించాలని కోరారు.

"ఈ సిరీస్ కోసం చాలా కష్టపడి పనిచేశాం. డార్క్ ఫ్యామిలీ డ్రామా. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కాస్త వయలెన్స్, సెక్స్ కూడా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ టీమ్ చాలా నిజాయితీగా పనిచేసింది. మీరు ఒక్కొక్కరూ ల్యాప్ ట్యాప్, మొబైల్ ఓపెన్ చేసి మొదలుపెడితే మీ ఎక్స్ ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. ఇది రానా షో. అక్కడక్కడా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి. ఇది పూర్తిగా రానా షో" అంటూ వెంకటేష్ నవ్వులు పూయించారు.

అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు తెరకెక్కింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్