Dasara Collections: దసరా రెండు వారాల కలెక్షన్లు ఇవీ.. సూపర్ హిట్-dasara collections in two weeks are here as the movie declared as hit ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dasara Collections: దసరా రెండు వారాల కలెక్షన్లు ఇవీ.. సూపర్ హిట్

Dasara Collections: దసరా రెండు వారాల కలెక్షన్లు ఇవీ.. సూపర్ హిట్

Hari Prasad S HT Telugu

Dasara Collections: దసరా రెండు వారాల కలెక్షన్లు వచ్చేశాయి. వాటిని బట్టి సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ మూవీ నష్టాలను మిగల్చడం కాస్త మింగుడు పడని విషయం.

దసరా హిట్

Dasara Collections: నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ హిట్ టాక్ కొట్టేసింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ.. నాని కెరీర్ లో తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా.. నానికి అతి పెద్ద హిట్ అందించింది. ప్రపంచవ్యాప్తంగా దసరా మూవీ రెండు వారాల్లో రూ.112 కోట్లు వసూలు చేయడం విశేషం.

అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.55.60 కోట్లుగా ఉంది. ఈ మూవీ రిలీజ్ కు ముందు రూ.47 కోట్ల బిజినెస్ చేసింది. ఆ లెక్కన సినిమా హిట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు వెర్షన్.. అందులోనూ నైజాం ఏరియాలో దసరా మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే ఏపీలో అందులోనూ సీడెడ్ ఏరియాలో మాత్రం ఈ మూవీ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.

అక్కడి బయర్లకు ఏకంగా రూ.1.5 కోట్ల నష్టాన్ని మిగిల్చిందీ మూవీ. ఇక తెలుగు కాకుండా మిగతా అన్ని భాషల్లోనూ దసరా తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ భాషల్లో ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. తెలుగు వెర్షన్ నైజాం ఏరియాతోపాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో దసరా లాభాలను ఆర్జించింది. రెండు వారాలు ముగిసే సమయానికి ఏపీ, తెలంగాణల్లో కలిపి రూ.42 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.7.85 కోట్లు, ఓవర్సీస్ లో రూ.10 కోట్లు రాబట్టింది.

దసరా మూవీ రిలీజైన సమయంలో మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. అయితే మూవీ ప్రమోషన్లు భారీగా ఉండటంతో మంచి ఓపెనింగ్ కలెక్షన్లు దక్కించుకుంది. తొలి వారంలోనే రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. తర్వాత మెల్లగా కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. మూవీ యూనిట్ కరీంనగర్ లో దసరా బ్లాక్ బస్టర్ ధావత్ కూడా చేసుకుంది.

సంబంధిత కథనం