Changure Bangaru Raja Teaser: కుక్కకు సునీల్ వాయిస్ ఓవర్.. ఇంట్రెస్టింగా ఛాంగురే బంగారురాజా టీజర్-changure bangaru raja reaser released as sunil lend his voice to a dog ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Changure Bangaru Raja Reaser Released As Sunil Lend His Voice To A Dog

Changure Bangaru Raja Teaser: కుక్కకు సునీల్ వాయిస్ ఓవర్.. ఇంట్రెస్టింగా ఛాంగురే బంగారురాజా టీజర్

Hari Prasad S HT Telugu
Apr 26, 2023 06:04 PM IST

Changure Bangaru Raja Teaser: కుక్కకు సునీల్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఛాంగురే బంగారురాజా టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. ఓ కుక్క.. ముగ్గురు వ్యక్తులు, ఓ హత్య చుట్టూ తిరిగే కథ ఇది.

ఛాంగురే బంగారురాజా టీజర్ లో కార్తీక్ రత్నం, సత్య
ఛాంగురే బంగారురాజా టీజర్ లో కార్తీక్ రత్నం, సత్య

Changure Bangaru Raja Teaser: ఓ కుక్క.. ముగ్గురు వ్యక్తులు.. ఓ హత్య.. వీటి చుట్టూ తిరిగే సరదా కథే ఛాంగురే బంగారురాజా మూవీ. తాజాగా బుధవారం (ఏప్రిల్ 26) ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. మాస్ మహారాజా రవితేజ ఈ టీజర్ లాంచ్ చేశాడు. ఇక ఇందులో కుక్కకు కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్ అయిన సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు కథలోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల పాత్రలు పోషించారు. ఈ మూవీకి కథను అందించడంతోపాటు దర్శకత్వం వహించాడు సతీశ్ వర్మ. ఛాంగురే బంగారురాజా టీజర్ చాలా ఆసక్తికరంగా మొదలువుతుంది. ఓ కుక్క తనను తాను పరిచయం చేసుకుంటుంది. తన పేరు వీరబొబ్బిలి అని.. ముగ్గురు వ్యక్తుల వల్ల తన జీవితం తలకిందులైందని చెబుతుంది.

ఆ కుక్కకే సునీల్ తనదైన స్టైల్లో వాయిస్ ఓవర్ అందించాడు. ఈ మూవీలో బంగార్రాజుగా కార్తీక్ రత్నం, తాతారావ్ గా సత్య, గాటీలుగా రవిబాబు నటించారు. టీజర్ మొదట్లో ఫన్నీగా సాగుతుంది. అయితే ఓ మర్డర్ కేసులో ఈ ముగ్గురే ప్రధాన అనుమానితులుగా ఉండటంతో వాళ్ల జీవితాలు మారిపోతాయి. ఆ హత్య చేసిందెవరో తనకు మాత్రమే తెలుసని వీరబొబ్బిలి ప్రత్యక్షమవుతుంది.

సరదాగా సాగిపోయే సీన్స్ తోపాటు హత్య ట్విస్టులో ఛాంగురే బంగారురాజా టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. దీనిని బట్టి సినిమా కూడా రొటీన్ ఫార్ములాకు భిన్నంగా ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ఈ మూవీకి కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించాడు. రవితేజ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్