Organic Mama Hybrid Alludu Release Date: బిగ్‌బాస్ సోహెల్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రిలీజ్ డేట్ ఫిక్స్‌-bigg boss sohel organic mama hybrid alludu release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Organic Mama Hybrid Alludu Release Date: బిగ్‌బాస్ సోహెల్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రిలీజ్ డేట్ ఫిక్స్‌

Organic Mama Hybrid Alludu Release Date: బిగ్‌బాస్ సోహెల్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రిలీజ్ డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 25, 2023 02:11 PM IST

Organic Mama Hybrid Alludu Release Date: బిగ్‌బాస్ సోహెల్ హీరోగా న‌టిస్తోన్న ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

సోహెల్‌, మృణాళిని
సోహెల్‌, మృణాళిని

Organic Mama Hybrid Alludu Release Date: బిగ్‌బాస్ సోహెల్ హీరోగా న‌టిస్తోన్న ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా రిలీజ్ డేట్‌ను శ‌నివారం అనౌన్స్‌చేశారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను మార్చి 3న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

శుభ‌ల‌గ్నం, మావిచిగురుతో పాటు ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎస్వీ కృష్టారెడ్డి లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో డైరెక్ట‌ర్‌గా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ సినిమాకు క‌థ‌, సంగీతం, స్క్రీన్‌ప్లే , ద‌ర్శ‌క‌త్వంతో పాటు మాట‌ల‌ను ఎస్వీ కృష్ణారెడ్డి అందించ‌డం గ‌మ‌నార్హం.

మృణాళిని హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టీన‌టులు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, మీనా కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు. మామ అల్లుళ్ల క‌థాంశంతో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాను రూపొందించారు.

సునీల్‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌ప్త‌గిరితో పాటు టాలీవుడ్ క‌మెడియ‌న్స్ అంద‌రూ ఇందులో న‌టించారు. కె అచ్చిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో కోనేరు క‌ల్ప‌న ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ త‌ర్వాత బిగ్‌బాస్ సోహెల్ న‌టిస్తోన్న సినిమా ఇది.

IPL_Entry_Point