Aakasam Trailer Launch by Nani: అశోక్ సెల్వన్ నటించిన 'ఆకాశం' ట్రైలర్ రిలీజ్.. నాని చేతుల మీదుగా విడుదల-ashok selvan starred aakasam trailer launched by actor nani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aakasam Trailer Launch By Nani: అశోక్ సెల్వన్ నటించిన 'ఆకాశం' ట్రైలర్ రిలీజ్.. నాని చేతుల మీదుగా విడుదల

Aakasam Trailer Launch by Nani: అశోక్ సెల్వన్ నటించిన 'ఆకాశం' ట్రైలర్ రిలీజ్.. నాని చేతుల మీదుగా విడుదల

Aakasam Trailer Launch by Nani: విలక్షణ నటుడు అశోక్ సెల్వన్ నటించిన ఆకాశం ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. ఈ సినిమా నవంబరు 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆకాశం ట్రైలర్ రిలీజ్

Aakasam Trailer Launch by Nani: వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ నటించిన ద్విభాషా చిత్రం ఆకాశం’. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందింది. ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్‌పై ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

ఈ సినిమా ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసి.. సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కి విషెష్ తెలియజేశారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఆకాశం టీజర్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

అశోక్ సెల్వన్ మూడు డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో కనిపించారు. అతని లైఫ్‌లో మూడు దశల్లోని జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక పాత్రలను తీర్చి దిద్దిన తీరు, వాటిని వారు క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

ప్రేమ, మోసం సహా లైఫ్‌లోని ఇతర భావోద్వేగాలు హీరో అశోక్ సెల్వన్ రోలర్ కోస్టర్‌లా ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది సినిమా అని స్పష్టంగా తెలుస్తోంది. దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే. ట్రైలర్‌లో విదు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించిన విజువల్స్, గోపి సుందర్ సంగీత సారథ్యం వహించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించినట్లు స్పష్టమవుతుంది.

సంబంధిత కథనం