Itlu Maredumilli Prajaneekam Censor: మారేడుమిల్లీలో ఓటింగ్‌కు అన్నీ పూర్తి.. వచ్చే వారం థియేటర్లలో అల్లరి నరేష్ చిత్రం-allari naresh movie itlu maredumilli prajaneekam censor completed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Itlu Maredumilli Prajaneekam Censor: మారేడుమిల్లీలో ఓటింగ్‌కు అన్నీ పూర్తి.. వచ్చే వారం థియేటర్లలో అల్లరి నరేష్ చిత్రం

Itlu Maredumilli Prajaneekam Censor: మారేడుమిల్లీలో ఓటింగ్‌కు అన్నీ పూర్తి.. వచ్చే వారం థియేటర్లలో అల్లరి నరేష్ చిత్రం

Maragani Govardhan HT Telugu
Nov 18, 2022 05:45 PM IST

Itlu Maredumilli Prajaneekam Censor: అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబరు 25న విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం యూ/ఏ సర్టిపికేట్ ఇచ్చింది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సెన్సార్ పూర్తి
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సెన్సార్ పూర్తి

Itlu Maredumilli Prajaneekam Censor: గతేడాది నాంది లాంటి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అల్లరి నరేష్.. అప్పటి నుంచి కంటెంట్ బేస్ స్టోరీకే మొగ్గుచూపుతున్నాడు. ఇందులో భాగంగా ఆయన నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకు విడుదలకు సిద్ధమైంది. నవంబరు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే 18 ఏళ్ల దాటినా పెద్దలందరూ ఈ సినిమా వీక్షించవచ్చు. అంతేకాకుండా పెద్దల సమక్షంలో పిల్లలు కూడా చూడవచ్చు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటుడిగా అల్లరి నరేష్‌కు ఇదే 59వ చిత్రం. జాంబీరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలతో అలరించిన ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. వీరితో పాటు వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను అలరించి.. చిత్రంపై అంచనాలను పెంచేశాయి.

ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా చేస్తుంది. జీ స్టూడియోస్ సమర్పణలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం