Alia Bhatt Naatu Naatu Dance: నాటు నాటు పాటకు ఆలియా డ్యాన్స్.. ఈ మధ్యే తల్లయినా స్టెప్పులు ఇరగదీసింది-alia bhatt naatu naatu dance at zee cine awards 2023 on sunday february 26th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Alia Bhatt Naatu Naatu Dance At Zee Cine Awards 2023 On Sunday February 26th

Alia Bhatt Naatu Naatu Dance: నాటు నాటు పాటకు ఆలియా డ్యాన్స్.. ఈ మధ్యే తల్లయినా స్టెప్పులు ఇరగదీసింది

Hari Prasad S HT Telugu
Feb 27, 2023 03:39 PM IST

Alia Bhatt Naatu Naatu Dance: నాటు నాటు పాటకు ఆలియా డ్యాన్స్ చేసింది. ఈ మధ్యే తల్లయినా కూడా ఆమె వేసిన స్టెప్పులు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పాటకు డ్యాన్స్ ఎంత కష్టమో తెలుసు కదా.

నాటు నాటు పాటకు స్టెప్పులేస్తున్న ఆలియా భట్, ఆయుష్మాన్ ఖురానా
నాటు నాటు పాటకు స్టెప్పులేస్తున్న ఆలియా భట్, ఆయుష్మాన్ ఖురానా

Alia Bhatt Naatu Naatu Dance: ఆలియా భట్.. బాలీవుడ్ లోని టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు. సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ లోనూ నటించింది. ఏడాది కాలంగా ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్స్ రేసులోనే ఉంది.

ఇప్పుడీ పాటకే ఆలియా కూడా స్టెప్పులేసింది. చాలా రోజుల తర్వాత మరోసారి స్టేజ్ పై కనిపించిన ఆలియా.. నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడం విశేషం. ఈ సాంగే కాదు.. అందులోని డ్యాన్స్ కూడా చాలా చాలా కష్టం. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి సూపర్ డ్యాన్సర్లు అదిరిపోయే స్టెప్పులేశారు. అలాంటి పాటకు ఈ మధ్యే తల్లయిన ఆలియా స్టెప్పులేయడం విశేషం.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ అవార్డుల సెర్మనీకి గెస్ట్ గా వచ్చిన ఆలియా.. తెల్ల చీరలో ఈ డ్యాన్స్ చేసింది. ఆమె ఎనర్జటిక్ డ్యాన్స్ చూసి అభిమానులు షాక్ తింటున్నారు. ఆలియా అమ్మగా మారి నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. అప్పుడే ఆమె ఇలా స్టేజ్ పైకి తిరిగి రావడమే కాదు.. నాటు నాటులాంటి పాటకు స్టెప్పులేయడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆదివారం (ఫిబ్రవరి 26) ఈ జీ సినీ అవార్డ్స్ సెర్మనీ జరిగింది. గతేడాది గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ లాంటి సినిమాల్లో నటించిన ఆలియాకు కూడా రెండు అవార్డులు దక్కాయి. ఇదే ఈవెంట్లో నాటు నాటు పాటతోపాటు ఈ మధ్య తాను నటించిన ఇతర సినిమాల్లోని పాటలకు కూడా ఆలియా స్టెప్పులేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఈవెంట్లో ఆలియాతో కలిసి ఆయుష్మాన్ ఖురానా, అపర్‌శక్తి ఖురానాలు కూడా నాటు నాటు స్టెప్పులు వేశారు. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకొని వేసే స్టెప్పులు వీళ్లు వేయడం విశేషం. ఆలియాకు అసలు ఎవరూ పోటీ లేరని, ఆమె గ్రేటెస్ట్ అంటూ ఈ డ్యాన్స్ చూసిన తర్వాత పలువురు అభిమానులు కామెంట్స్ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్