2018 OTT Release Date: అఫీషియల్.. 2018 ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. ఎందులో అంటే?
2018 OTT Release Date: అఫీషియల్.. 2018 ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను సోనీలివ్ సోమవారం (మే 29) అధికారికంగా అనౌన్స్ చేసింది.
2018 OTT Release Date: మలయాళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసిన 2018 మూవీ తన డిజిటల్ ప్రీమియర్ కోసం రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ 2018 మూవీ.. సోనీలివ్ (Sony LIV) ఓటీటీలో రానుంది. ఈ విషయాన్ని సోనీలివ్ సోమవారం (మే 29) అధికారికంగా అనౌన్స్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఆంథని జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 7 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మధ్యే ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ వెర్షన్లలో రిలీజైన విషయం తెలిసిందే. దీంతో జూన్ 7 నుంచి మొదట మలయాళంలోనే 2018 అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది. ఆ వరదల్లో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అలాంటి విపత్తును ఈ మూవీ మేకర్స్ కళ్లకు కట్టినట్లు చూపించడంలో సక్సెసయ్యారు. దీని ఫలితమే ఇప్పుడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఒక్క కేరళలోనే రూ.80 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం.
2018 మూవీ తెలుగు వెర్షన్ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మూడు రోజుల్లో రూ.4.5 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ లో తెలుగులో ఈ సినిమా సక్సెస్ అయినట్లే. 2018లో లాల్, నరైన్, అపర్ణ బాలమురళీ, కలయిరాసన్, అజూ వర్ఘీస్, వినీత్ శ్రీనివాసన్ లాంటి వాళ్లు నటించారు.
సంబంధిత కథనం