Gundu SudhaRani: కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ మేయర్​ సుధారాణి..భగ్గుమంటున్న హస్తం పార్టీ నేతలు-mayor sudharani joined the congress party in warangal ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Gundu Sudharani: కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ మేయర్​ సుధారాణి..భగ్గుమంటున్న హస్తం పార్టీ నేతలు

Gundu SudhaRani: కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ మేయర్​ సుధారాణి..భగ్గుమంటున్న హస్తం పార్టీ నేతలు

Sarath chandra.B HT Telugu
Apr 26, 2024 05:58 AM IST

Gundu SudhaRani: రాష్ట్రంలో ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల హీట్ నడుస్తుండగా.. గ్రేటర్​ వరంగల్ రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్‌ పార్టీలో చేేరిపోయారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి

Gundu SudhaRani: గ్రేటర్​ వరంగల్ మేయర్​ గుండు సుధారాణి Gundu Sudharani కాంగ్రెస్ Congress​ చేరుతున్నారని నెల కిందటి నుంచే ప్రచారం జరగగా.. అప్పట్లోనే హస్తం పార్టీ కార్పొరేటర్లు Corporators, ఇతర పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కొంతకాలం మేయర్​ కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకునే వ్యవహారం తెరమరుగు కాగా.. గురువారం సుధారాణి ఎవరికీ చెప్పకుండా సైలెంట్​ గా వెళ్లి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి Jaggareddy ఆధ్వర్యంలో కాంగ్రెస్​ లో చేరారు.

మేయర్​ గుండు సుధారాణి కాంగ్రెస్​ చేరనున్నారనే విషయం పాతదే అయినా.. ఆమె జిల్లా నేతలు, కార్పొరేటర్లకు ఇష్టం లేకుండానే పార్టీలో చేరడంతో స్థానిక నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్​ లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అవిశ్వాస బెడదతోనే..!

అసెంబ్లీ ఎన్నికల తరువాత గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. దీంతోనే మంత్రి కొండా సురేఖ Kondasurekha భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే మేయర్ గుండు సుధారాణి తీరు పట్ల అసంతృప్తితో ఉన్న నేతలంతా హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

ఓ వైపు బీఆర్​ఎస్​ పార్టీ ప్రాభవం కోల్పోవడం, కాంగ్రెస్​ పార్టీ మేయర్​ పీఠంపై కన్నేసి అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్నారన్న సమాచారంతో గుండు సుధారాణి సెల్ఫ్​ డిఫెన్స్​ లో పడ్డారు. వాస్తవానికి మేయర్​ పై అవిశ్వాసం పెట్టేందుకు కనీసం మూడేళ్ల పదవి కాలమైనా పూర్తి కావాలనే నిబంధన ఉంది.

ఈ లెక్క 2021 మే 3న మేయర్​ గా ఎన్నికైన గుండు సుధారాణి పదవీకాలం 2024 మే 3వ తేదీతో మూడేళ్లు పూర్తవుతోంది. ఇంకో పదిరోజుల్లో ఆ గడువు కూడా దగ్గరపడుతుండటం, మేయర్​ అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందన్న ఉద్దేశంతో గుండు సుధారాణి తన ప్రయత్నాలు తాను చేసుకున్నారు.

కార్పొరేటర్ల వ్యతిరేకతతో ఇన్నిరోజులు సైలెన్స్​

మేయర్​ తీరుపై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు చాలామంది ఇప్పటికే కాంగ్రెస్​ లో చేరారు. ఆ తరువాత ఈ ఏడాది మార్చి నెలలో గుండు సుధారాణి కూడా కాంగ్రెస్​ కండువా కప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డితో పాటు పార్టీ ప్రముఖులను కలిసి తాను కాంగ్రెస్​ లో చేరుదామనుకుంటున్న విషయాన్ని చెప్పారు.

ఆల్రెడీ హస్తం పార్టీలో చేరిన కార్పొరేటర్లంతా ఆమె రాకను వ్యతిరేకించారు. మేయర్​ పై అసహనంతోనే కాంగ్రెస్​ లో చేరితే.. ఇప్పుడు ఆమెను పార్టీలోకి తీసుకుంటే తాము మళ్లీ పార్టీ మారుతామని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల సమయంలో వివాదాలు తలెత్తవద్దనే ఉద్దేశంతో హస్తం పార్టీ పెద్దలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకోకుండా హోల్డ్​ లో పెట్టారు.

మేయర్​ చేరికతో అసంతృప్తి

మేయర్​ గుండు సుధారాణి దాదాపు రెండు నెలల పాటు కాంగ్రెస్​ పార్టీ పెద్దల చుట్టూ తిరిగారు. చివరకు కొందరు నేతల సపోర్ట్​ తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె చేరికతో జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, ఇతర నేతలంతా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఆమె చేరికను స్వాగతించడం లేదని, ఎలాగైనా సుధారాణిని గద్దె దించాలనే ఉద్దేశంతోనే వారున్నట్టు సమాచారం.

సుధారాణి ఓ చెల్లని రూపాయి..మండిపడ్డ కార్పొరేటర్లు

మేయర్​ గుండు సుధారాణి ఓ చెల్లని రూపాయి అని, ఆమె చేరికతో కాంగ్రెస్​ పార్టీ కలుషితం అయ్యే అవకాశం ఉందని గ్రేటర్​ కార్పొరేటర్లు మండిపడ్డారు. గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ అదే పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.

గుండు సుధారాణి చేరికను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆమె వెంట ఒక్క కార్పొరేటర్​ కూడా లేరని, తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కాకుండా, కనీస మర్యాద ఇవ్వకుండా పార్టీలో చేరడం సరైంది కాదన్నారు. గుండు సుధారాణిని పార్టీలోకి తీసుకోవద్దని, ఆమె కూడా స్వతహాగా కాంగ్రెస్​ నుంచి తప్పుకోవాలని డిమాండ్​ చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం