Most popular car in India : దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కారు, బైక్​ ఇవే..-hyundai creta bajaj pulsar are most popular car and bike in india in 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hyundai Creta, Bajaj Pulsar Are Most Popular Car And Bike In India In 2022

Most popular car in India : దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కారు, బైక్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Feb 28, 2023 10:36 AM IST

Most popular car in India : హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ, బజాజ్​ పల్సర్​లు.. 2022లో దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కారు, బైక్​గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది.

దేశంలో ప్రజాదారణ పొందిన కారు, బైక్​ ఇవే..
దేశంలో ప్రజాదారణ పొందిన కారు, బైక్​ ఇవే..

Most popular car in India : దేశంలో ప్యాసింజర్​ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్​ మార్కెట్​లో అవతరించింది ఇండియా. మరి వీటిల్లో భారీగా ప్రజాదారణ పొందిన మోడల్స్​ ఏవి? అన్న విషయంపై ఓ ఆటో ఈ-కామర్స్​ సంస్థ అధ్యయనం చేపట్టింది. హ్యుందాయ్​కు చెందిన క్రేటా ఎస్​యూవీ, బజాజ్​ ఆటోకు చెందిన పల్సర్​ బైక్​లు.. 2022లో దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కారు, బైక్​గా గుర్తింపు తెచ్చుకున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది.

ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో కొరియన్​ సంస్థల హవా..

డ్రూమ్స్​.. యాన్యువల్​ 'ఇండియా ఆటోమొబైల్​ ఈకామర్స్​ రిపోర్ట్​' ఫర్​ 2022 ప్రకారం.. ఇండియాలో కొరియన్​ సంస్థల హవా నడుస్తోంది. అత్యంత ప్రజాదారణ పొందిన కారుగా హ్యుందాయ్​ క్రేటా తొలి స్థానంలో నిల్వగా.. మరో కొరియన్​ సంస్థకు చెందిన కియా సెల్టోస్​ 2వ సీటును దక్కించుకుంది. మారుతీ సుజుకీ బ్రెజా.. ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఎంపీవీ- పెద్ద ఎస్​యూవీల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్​లు నిలిచాయి.

ఇక ఇండియాలోని లగ్జరీ వాహనాల సెగ్మెంట్​లో ప్రజాదారణ పొందిన సంస్థగా మెర్సిడెస్​ బెంజ్​ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సంస్థ నుంచి గతేడాది వచ్చిన ఈ- క్లాస్​.. మంచి డిమాండ్​ సంపాదించుకుంది. జీప్​ కంపాస్​, మెర్సిడెస్​ బెంజ్​ సీ క్లాస్​, బీఎండబ్ల్యూ5 సిరీస్​లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2 వీలర్​ బాస్​.. బజాజ్​ ఆటో!

Most popular bike in India : ఇక 2 వీలర్​ సెగ్మెంట్​లో.. హీరో మోటోకాప్​తో పోల్చుకుంటే బజాజ్​ ఆటో మోడల్సే ఎక్కువగా ప్రజాదారణ పొందినవి ఉన్నాయి! భారతీయుల్లో బజాజ్​ పల్సర్​కు భారీగా ప్రజాదారణ ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. హీరో స్ప్లెండర్​ ప్లస్​, బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​, టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​, హోండా సీబీ షైన్​ వంటివి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లగ్జరీ బైక్స్​ సెగ్మెంట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్​, హార్లీ డేవిడ్​సన్​ స్ట్రీట్​ 750, కవాసాకీ నింజా జెడ్​ఎక్స్​-10ఆర్​ వంటివి ప్రజాదారణ పొందాయి.

అధ్యయనం ప్రకారం.. ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉన్న వాహనాలకు ఇటీవలి కాలంలో ప్రజాదారణ పెరుగుతోంది. 2015లో ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ వాహనాల వాటా 23శాతంగా ఉండగా.. 2022కు అది 33శాతానికి పెరిగింది. సౌలభ్యంతో పాటు ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ కూడా ఎక్కువగా ఉంటుండటంతో ఇది సాధ్యపడుతోంది.

Hyundai Creta most popular car in India : దేశంలో డీజిల్​ వాహనాలకు ప్రజాదారణ తగ్గిపోతోందని అధ్యయనం స్పష్టం చేసింది. 2021లో 60శాతంగా ఉన్న డీజిల్​ వాహనాల వాటా.. 2022లో 53శాతానికి పడిపోయింది. అదే సమయంలో మొత్తం వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ వాటా 1శాతంగానే ఉందని పేర్కొంది.

WhatsApp channel