Is Diesel car outdated?: డీజిల్ వాహనాలు ఇక కనిపించవా?-the diesel car is dying here s why ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Is Diesel Car Outdated?: డీజిల్ వాహనాలు ఇక కనిపించవా?

Is Diesel car outdated?: డీజిల్ వాహనాలు ఇక కనిపించవా?

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 09:25 PM IST

Is Diesel car outdated?: డీజిల్ వాహనాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్, ఒక ప్రత్యేకమైన కస్టమర్ బేస్ ఉండేది. ఇప్పుడా పరిస్థితి మారింది. ప్రభుత్వ విధానాలకు తోడు కొత్తగా వస్తున్న ఇంధన వేరియంట్లు డీజిల్ వాహనాలకు శాపంగా మారాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Diesel car Market leader: డీజిల్ వాహనాలకు ఒకప్పుడు అతిపెద్ద మార్కెట్ భారత్. ఇప్పుడా పరిస్థితి మారుతోంది. క్రమంగా డీజిల్ వాహనాల వాటా తగ్గుతోంది. కొత్త వాహనాల కొనుగోలులో డీజిల్ మోడల్ చివరి ఆప్షన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం మొత్తం వాహానాల అమ్మకాల్లో డీజిల్ వాహనాల వాటా 20% లోపే ఉంటోంది. కఠిన కాలుష్య నియంత్రణ నిబంధనల కారణంగా డీజిల్ వాహనాలు అంతరించిపోనున్న జాతుల జాబితాలోకి చేరనున్నాయి.

Is Diesel car outdated?: ఒక సెగ్మెంట్లో మాత్రం లీడర్..

హ్యాచ్ బ్యాక్, సెడాన్ విభాగాల కార్లలో డీజిల్ కార్ల వాటా గణనీయంగా తగ్గింది. ప్యాసెంజర్ వాహనాల్లో 2012లో డీజిల్ వెహికిల్స్ వాటా 54 శాతం. 2022 కి వచ్చేసరికి ఆ వాటా 20% లోపునకు చేరింది. 4 మీటర్లలోపు పొడవున్న వాహనాల కేటగిరీలో.. హ్యాచ్ బ్యాక్, సెడాన్ ల్లో 1% మాత్రమే డీజిల్ వాహనాలు అమ్ముడవుతున్నాయి. వ్యాన్ లు, యుటిలిటీ వాహనాల్లో అది 25% వరకు ఉంది. కాంపాక్ట్ ఎస్ యూవీల్లో డీజిల్ వాహనాల వాటా 16%. 7 సీటర్ యుటిలిటీ వాహనాల్లో ఒకప్పుడు డీజిల్ మోడల్సే మార్కెట్ లీడర్స్. ఇప్పుడు ఆ కేటగిరీలోనూ డీజిల్ స్థానాన్ని సీఎన్జీ, పెట్రోలు వాహనాలు ఆక్రమించాయి. కేవలం 4 మీటర్ల కన్నా ఎక్కవ పొడవైన ఎస్యూవీల్లో మాత్రం ఇప్పటికీ డీజిల్ వెహికిల్సే నెంబర్ 1. ఈ కేటగిరీలో డీజిల్ వాహనాల వాటా దాదాపు 80%. బస్సులు, లారీల వంటి వాహనాలకు ఇప్పటికీ డీజిల్ కు సరైన ప్రత్యామ్నాయం లేదు.

Diesel, Petrol Price difference: ధరలో వ్యత్యాసం తగ్గడం..

డీజిల్ వాహనాల అమ్మకాల్లో భారీగా తగ్గుదల నమోదు కావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది డీజిల్, పెట్రోల్ ధరల్లో వ్యత్యాసం నామమాత్రపు స్థాయికి చేరడం. ఇప్పుడు డీజిల్, పెట్రోలు ధరలు దాదాపు సమానం. 2012లో లీటర్ డీజిల్ రేటుకు, లీటర్ పెట్రోలు రేటుకు మధ్య రూ. 32 ల తేడా ఉండేది. ఇప్పుడు అది 10 రూపాయల దిగువకు చేరింది. అదీకాక, పెట్రోలు వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువ. రీసేల్ వ్యాల్యూ ఎక్కువ. దాంతో, చాలా మంది పెట్రోలు వాహనాలను, వీలైన చోట సీఎన్జీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

Strict anti omission norms : ప్రభుత్వ నిబంధనలు

అంతర్జాతీయ కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధిస్తోంది. బీఎస్ 6 డీజిల్ ఇంజిన్ల తయారీ కూడా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. కాలుష్య రహిత లేదా, తక్కవ కాలుష్యం వెదజల్లే వాహనాల కొనుగోలుకు ప్రోత్సహాకాలను ఇస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

No diesel cars from this companies: ఈ కంపెనీల్లో డీజిల్ కార్లే లేవు

ప్రస్తుతం మారుతి సుజుకీ, ఫోక్స్ వ్యాగన్, స్కోడా, ఆడి, రెనో, నిస్సాన్ కంపెనీలు భారత్ లో డీజిల్ వాహనాలను తయారు చేయడం లేదు. డీజిల్ వాహనాల తయారీ నుంచి మారుతి సంస్థ తప్పుకోవడం డీజిల్ వాహనాల అమ్మకాలపై పెను ప్రభావం చూపింది. కొన్నేళ్ల క్రితం వరకు బ్రెజా సహా మారుతికి చెందిన 7 మోడళ్లు డీజిల్ వేరియంట్ లో లభించేవి.

WhatsApp channel

టాపిక్