Honda city facelift launch in India : ఇండియా ఆటో మార్కెట్లో అందుబాటులో ఉన్న సెడాన్ మోడల్స్‌లో.. హోండా సిటీకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ వెహికిల్‌కి ఉన్న క్లాసీ లుక్, డీసెంట్ ఫీచర్స్.. కస్టమర్లను ఆకర్షిస్తాయి. అందుకు తగ్గట్టుగానే హోండా సిటీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది ఆటో సంస్థ. ఇక ఇప్పుడు.. ఫిఫ్త్ జెనరేషన్ హోండా సిటీకి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రానున్నట్టు తెలుస్తోంది. 2023 మార్చ్.. అంటే వచ్చే నెలలోనే దీని లాంచ్ ఉంటుందని సమాచారం.
ఇండియా మార్కెట్లో.. 2020 మధ్యలో ఈ ఫిఫ్త్ జెన్ హోండా సిటీ లాంచ్ అయ్యింది. ఇక త్వరలో రానున్న హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో భారీ మార్పులు ఉండవని తెలుస్తోంది. కాస్మొటిక్స్ విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చని సమచారం. అయితే.. ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో కొత్త వేరియంట్ వచ్చే అవకాశం ఉంది.
Honda city facelift 5th Gen facelift : హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో ఫ్రెంట్ అండ్ రేర్ బంపర్స్ మారొచ్చు. అలాయ్ వీల్స్‌కు కొత్త డిజైన్ రావొచ్చు. 2023 హోండా సిటీ కోసం వేరియంట్ లైనప్ మారే అవకాశం ఉంది. ఫీచర్స్ పరంగానూ పెద్దగా మార్పులు ఉండపోవచ్చు. వెంటిలేటెడ్ సీట్స్, వయర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్స్ లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా సిటీ టాప్ ఎండ్ మోడల్లో ఈహెచ్ఈవీ ఇంజిన్ ఉంటుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 19.89లక్షలు. స్టాండర్డ్ పెట్రోల2 వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 15.62లక్షలు. ఈహెచ్ఈవీ ఇంజిన్‌కు సంబంధించి.. రానున్న ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో చౌకైన వేరియంట్‌ను హోండా తీసుకురోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా.. పెట్రోల్- హైబ్రీడ్ వేరియంట్ల ధర మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కాస్త తగ్గుతుంది.
Hyundai Aura Facelift : హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఫీచర్స్, ధర వంటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
హోండా సిటీ సెడాన్ మోడల్‌ను డీజిల్ ఇంజిన్‌తో అమ్మడం లేదు. గతంలో ఉన్న 100హెచ్‌పీ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ నుంచి హోండా సంస్థ డిస్కంటిన్యూ చేసింది.
2023 Honda city model : ఇక 2023 హోండా సిటీ సెడాన్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 121 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ సెటప్ ఉంటాయి. అంతేకాకుండా.. అట్కిన్సన్ సైకిల్ 1.5 లీటర్ పెట్రోల్- హైబ్రీడ్ ఇంజిన్‌లోనూ ఈ హోండా సిటీ రానుంది. ఇది 126హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో ఈ-సీవీటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ కన్నా.. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ధర ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఇక ఇండియా మార్కెట్లోని స్కోడా స్లావియా, వోక్స్వ్యాగన్ వర్టుస్, మారుతీ సుజుకీ సియాజ్, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లకు.. ఈ హోండా సిటీ సెడాన్ గట్టిపోటీనిస్తోంది.
Honda city on road price in Hyderabad : హోండా నుంచి కొత్త ఎస్యూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మిడ్- సైజ్ ఎస్యూవీ.. 2023 మధ్యలో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన టీజర్‌ను హోండా సంస్థ ఇప్పటికే విడుదల చేసింది.
సంబంధిత కథనం