Chandrababu In Mahanadu : వచ్చేది కురుక్షేత్రం ఆ యుద్ధంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం- చంద్రబాబు-rajamahendravaram tdp mahanadu chandrababu fires on ysrcp govt tells sixteen example on cm jagan ruling ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rajamahendravaram Tdp Mahanadu Chandrababu Fires On Ysrcp Govt Tells Sixteen Example On Cm Jagan Ruling

Chandrababu In Mahanadu : వచ్చేది కురుక్షేత్రం ఆ యుద్ధంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం- చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu
May 27, 2023 02:06 PM IST

Chandrababu In Mahanadu : రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు ప్రారంభం అయింది. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో సీఐడీ(CID) ప్రభుత్వం, అంటే కరప్షన్, ఇన్ ఎఫిషియంట్, డిస్ట్రక్షన్ అని విమర్శించారు.

మహానాడులో చంద్రబాబు
మహానాడులో చంద్రబాబు (Image Credit : TDP Twitter)

Chandrababu In Mahanadu : తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. మహానాడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ... ఈ మహానాడు ప్రత్యేకమైనదన్నారు. క్యాడర్ లో ఉత్సాహం పెరిగిందని, మంచి ఎనర్జీ వచ్చిందన్నారు. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు పోదామంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆయనను తెలుగు జాతి స్మరించుకుందన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. అలాంటి మహానాయకుడికి మనం వారసులమన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ దూసుకుపోవడమే

"రాజమహేంద్రవరం...ఎన్టీఆర్ మెచ్చిన నగరం. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు రాజమహేంద్రవరం వేదిక. నన్నయ..ఇక్కడే నడయాడాడు...కందుకూరి వీరేశిలింగం ఇక్కడే పుట్టాడు. ఇక్కడే కాటన్ నివశించాడు.ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చాడు. కాటన్ చేసిన సేవలకు గాను....ప్రతి ఊళ్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఇది ఆయనకు దక్కిన గౌరవం. ఇది చారిత్రక మహానాడు.. ఒకవైపు ఎన్టీఆర్ శతజయంతి....మరో వైపు 42 ఏళ్ల ప్రయాణం. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదాం అని సంకల్పం తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది. పుసుపు రంగు అనేది శుభసూచకం. మన పార్టీ ఎంబ్లమ్ లో నాగలి, చక్రం, ఇల్లు పెట్టారు. రైతులను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని నాడు నాగలి పెట్టారు. శ్రమ జీవుల కోసం చక్రం పెట్టారు. పేదల కోసం ఇళ్లు పెట్టారు. తెలుగు దేశం జెండా...తెలుగు జాతికి అండ. తెలుగు దేశం సింబల్ సైకిల్..ముందు చక్రం అంటే సంక్షేమం రెండో చక్రం అభివృద్ధి. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చింది. దాంతో ఇక దూసుకుపోవడమే." - చంద్రబాబు

సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసిందే టీడీపీ

నాలుగేళ్లలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని, అరెస్టులు, కేసులు, దాడులకు ఏ ఒక్క నాయకుడు భయపడలేదని చంద్రబాబు అన్నారు. మాచర్లలో చంద్రయ్యను చంపే సమయంలో అతన్ని జై జగన్ అంటే వదిలేస్తా అన్నారన్నారు. కానీ ప్రాణాలు వదులుకున్నాడు కానీ.....జై జగన్ అనలేదని గుర్తుచేశారు. జై తెలుగుదేశం అని ప్రాణాలు ఇచ్చాడన్నారు. అందుకే చంద్రయ్య పాడె మోశానన్నారు చంద్రబాబు. కుటుంబ పెద్దగా కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొని తెలుగుదేశం కార్యకర్తలు నిలబడ్డారన్నారు. మీ అందరి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా, శిరసు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నా అన్నారు. సంపద సృష్టించడమే కాదు ...పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగు దేశం అన్నారు. ఏపీలో సంక్షేమ పథకాలు మొదలు పెట్టిందే తెలుగుదేశం అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు రూ.50 హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చామన్నారు. దేశంలో మొదటి సారి పేదలకు పెన్షన్ ఇచ్చిన పార్టీ టీడీపీ అని తెలిపారు.

ఇది సీఐడీ ప్రభుత్వం

2014లో రూ.200 పెన్షన్ ఉంటే....రూ.2000 చేసిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. 2014 తరువాత వందల సంఖ్యలో పథకాలు అమలు చేశామన్నారు. హైదరాబాద్ నగరాన్ని మనమే అభివృద్ధి చేశామన్నారు. 2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 స్టేట్ చేయాలని పనులు చేశామన్నారు. వ్యవసాయంలో 11 శాతం వృద్ధి రేటు సాదించామన్నారు. ఇరిగేషన్ పై రూ.64 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 16 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఆ పెట్టుబడులు వచ్చి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు. 2019లో ఒక్కడు వచ్చి, ఎన్నో మాటలు చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో సీఐడీ ప్రభుత్వం ఉందని, సీఐడీ అంటే కరప్షన్, ఇన్ ఎఫిషియంట్, డిస్ట్రక్షన్ ప్రభుత్వం అని మండిపడ్డారు. రివర్స్ టెండర్లు ,పరిపాలనను రివర్స్ చేశారన్నారు. ప్రజా వేదిక కూల్చి వేతతో పాలన మొదలు పెట్టారని ఆరోపించారు. అమరావతిని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.

రాజమండ్రిలో టీడీపీ మహానాడు
రాజమండ్రిలో టీడీపీ మహానాడు

జాబ్ క్యాలెండర్ లేదు జాబ్స్ లేవు

"పోలవరం పూర్తి అయ్యి నదుల అనుసంధానం జరిగితే మంచి ఫలితాలు వచ్చేవి. ఒక్క రోడ్డు వేయలేదు...ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.....ప్రభుత్వ ఉగ్రవాదంతో ఒక్క పెట్టుబడి రాలేదు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లేదు జాబ్స్ లేవు. దిశ చట్టం అన్నాడు...ఎక్కడ ఉందో చెప్పాలి. లేని చట్టం పేరుతో రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ పెట్టాడు. ఉద్యోగం రావాలి అంటే ప్రత్యేక హోదా కావాలి అని నాడు జగన్ అన్నాడు. 25 మందిని గెలిపిస్తే....ప్రత్యేక హోదా సాధిస్తాను అని...ఇప్పుడు మెడలు దించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. అమ్మఒడి ఒక నాటకం...నాన్న బుడ్డి వాస్తవం. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. జగన్ నాలుగేళ్ల తప్పిదాలపై చెప్పాలంటే మన ఒక్క మహానాడు సమయం సరిపోదు."- చంద్రబాబు

రైతు అప్పుల్లో ఏపీ టాప్

"ఈ నాలుగు నెలల్లో ఏం జరిగిందో...ఓ 16 ఉదాహరణలు చెపుతాను. ఏపీ నుంచి ఐటీ ఎగుమతులు కేవలం 0.02 శాతం, జల్ జీవన్ మిషన్ లో రాష్ట్రం 18 ర్యాంక్, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3 స్థానం. రైతు అప్పుల్లో టాప్. ఎఫ్డీఐ పెట్టుబడుల్లో రాష్ట్రం స్థానం 14. రాష్ట్రంలో నేటి అప్పులు రూ.10 లక్షల కోట్లు పైగా దేశంలో రిచ్చెస్ట్ సీఎంగా జగన్. రూ. 510 కోట్లు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 35 శాతం. నిర్మాణ రంగ సంక్షోభంతో శ్రీకాకుళం జిల్లాలో మే 26, 2023 న పురుషోత్తం సాహు అనే భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య. అయినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. అన్నమయ్య జిల్లాలో మే 22, 2023 న కృష్ణయ్య (29) అనే యువ రైతు వర్షాలకు పంట దెబ్బతినడంతో ఆత్మహత్య. రూ.1500 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలతో సేవల నిలిపివేత. ఏప్రిల్ 18న గుంటూరు మున్సిపాలిటీలో వైసీపీ కార్పొరేటర్ వేధింపులకు కనపర్తి విమల అనే మహిళ ఆత్మహత్య. తిరుమలలో గంజాయి వ్యాపారం... మార్చి 28 పట్టుబడిన ఉద్యోగి. 6 నెలల చెత్తపన్ను ఒకే సారి వసూలుకు నిర్ణయం. చిత్తూరు జిల్లాలో తాగునీటిని సరఫరా చేసిన వారికి రూ.225 కోట్లు బిల్లులు పెండింగ్. మార్చి 7 న చింతపల్లి మండలంలో అడవిలో ఆడబిడ్డ ప్రసవం. వచ్చేది కురుక్షేత్రం.....ఆ యుద్ధంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం. శాసన సభను గౌరవ సభ చేసి అసెంబ్లీకి వెళదాం." - చంద్రబాబు

IPL_Entry_Point