Pawan Varahi Vehicle : ఎన్టీఆర్ చైతన్య రథం లాంటిదేనా.. పవన్ 'వారాహి'-pawan kalyan ready for election battle with varahi vehicle ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pawan Kalyan Ready For Election Battle With Varahi Vehicle

Pawan Varahi Vehicle : ఎన్టీఆర్ చైతన్య రథం లాంటిదేనా.. పవన్ 'వారాహి'

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 06:01 PM IST

Pawan Kalyan Election Vehicle : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం ఓ వాహనం సిద్ధమవుతోంది. దాని పేరు వారాహి. రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ వాహనం
పవన్ కల్యాణ్ వాహనం

పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'వారాహి' రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని ప్రకటించారు. ఈ వాహనం ట్రయల్ రన్ పవన్ హైదరాబాద్లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ మాట్లాడారు.

వారాహి అంటే..

ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.

2024 ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. ఈ మేరకు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్లో యాత్ర చేయాలనుకున్నా.. పలు కారణాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు వారాహి(Varahi) కూడా రెడీ అవుతోంది. ఏపీలో అంతటా తిరిగి.. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ మాట్లాడుతారని జనసైనికులు చెబుతున్నారు. అయితే ఈ బస్సును చూస్తే.. ఎన్టీఆర్(NTR) చైతన్య రథం పోలినట్టుగా ఉందనే చర్చ నడుస్తోంది.

ఇప్పటి వరకూ పార్టీల నేతలు వాడిన బస్సులకు భిన్నంగా వారాహి తయారవుతోంది. వాహనం టైర్లు చూసినా.. పెద్ద పెద్ద టైర్లను అమర్చారు. ఈ వెహికల్ లో మెుత్తం ఆరుగురు కూర్చొని మాట్లాడుకునేలా.. సిట్టింగ్ రూమ్(Sitting) ఏర్పాటు చేస్తున్నారు. వాహనం చుట్టూ.. ఎప్పటికప్పుడు పరిశీలించేలా.. సీసీ కెమెరాలు పెడుతున్నారు. వాహనం బాడీకి రెండు వైపులా.. సెక్యూరిటీ సిబ్బంది నిలుచునేలా తయారు అవుతోంది.

అంతేకాదు.. వాహనం టాప్(Vehicle Top) పైకి పవన్ చేరుకునే విధంగా పవర్ లిఫ్ట్ సిస్టం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం. సౌండ్, లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో వారాహి వాహనం రెడీ అవుతోంది. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలి ఉండేలా.. పవన్ వారాహి ఉందని చర్చ నడుస్తోంది.

పవన్ యాత్ర(Pawan Yatra)ను మరికొద్దిరోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్నికల్లో కూడా దీనినే ఉపయోగించనున్నారు. దీంతో వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ, మెరుగైన హంగులుతో వాహనం రోడ్డుపైకి రానుంది. ఎప్పటికప్పుడు పవన్(Pawan) కూడా వాహనాన్ని పరిశీలిస్తున్నారు. తాజాగా ట్వీట్టర్లో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో పవన్ పోస్ట్ చేశారు.

IPL_Entry_Point