TS EAMCET Rankers: తెలంగాణ ఎంసెట్‌లో సత్తా చాటిన ఆంధ్రా విద్యార్ధులు-andhra students have top ranks in telangana eamcet and they are in the top ten positions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Students Have Top Ranks In Telangana Eamcet And They Are In The Top Ten Positions

TS EAMCET Rankers: తెలంగాణ ఎంసెట్‌లో సత్తా చాటిన ఆంధ్రా విద్యార్ధులు

HT Telugu Desk HT Telugu
May 26, 2023 08:57 AM IST

TS EAMCET Rankers: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రా విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ఎంసెట్ పరీక్షల్ని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ విద్యార్దులు తెలంగాణలో కూడా ఎంసెట్‌కు హాజరవుతున్నారు. వీటిలో ఏపీ విద్యార్ధులు ర్యాంకులు దక్కించుకున్నారు.

టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

TS EAMCET Rankers: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫలితాల్లో ఆంధ్రా విద్యార్దులు మెరుగైన ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో 8, అగ్రికల్చర్‌, ఫార్మసీలో మొదటి పదిలో 7 ర్యాంకుల్ని ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌లో మొదటి స్థానాల్లో ఏపీ విద్యార్ధులు నిలిచారు.

అగ్రికల్చర్‌లో 155 మార్కుల స్కోర్‌తో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్యరాజ జస్వంత్‌, ఇంజినీరింగ్‌లో 158.89 స్కోర్‌తో విశాఖ విద్యార్థి సనపల అనిరుధ్‌ ప్రథమ ర్యాంకులు సాధించారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు.

తొలి పది ర్యాంకుల్లో అత్యధికం అబ్బాయిలు దక్కించుకున్నారు. ఉత్తీర్ణతా శాతంలో మాత్రం అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంజినీరింగ్‌లో దాదాపు 3 శాతం, అగ్రికల్చర్‌లో సుమారు 2.50 శాతం అమ్మాయిలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు.

ఎంసెట్‌ పరీక్ష రాసిన వారిలో ఇంజినీరింగ్‌ విభాగంలో 80.33%, అగ్రికల్చర్‌లో 86.31% మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. మొత్తం 160 మార్కుల పరీక్షలో 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ జారీచేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్ విభాగంలో 80% మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్​లో 86% మంది క్వాలిఫై అయ్యారు. గత ఏడాది కూడా మెజార్టీ టాప్ ర్యాంకులు ఏపీ విద్యార్ధులు దక్కించుకున్నారు. ఇంజినీరింగ్​లో టాప్ 10లో తెలంగాణ విద్యార్దులు ఇద్దరే ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్ టాప్10లో ముగ్గురు మా త్రమే ఉన్నారు. మిగిలిన ర్యాంకులన్నీ ఏపీ విద్యార్ధులు సాధించారు.

ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిలు 79% మంది క్వాలిఫై కాగా, అమ్మాయిలు 82% మం ది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ స్ర్టీమ్​లో అబ్బాయిలు 84 శాతం మంది అర్హత సాధించగా, అమ్మాయిలు 87శాతం మంది అర్హత సాధించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

తెలంగాణలో అందుబాటులో ఉన్న సీట్లలో 85% సీట్లను తెలంగాణ స్టూడెంట్లకు, 15% ఓపెన్ కేటగిరీలో ఏపీ, తెలంగాణ విద్యార్ధులకు కేటాయిస్తామని తెలిపారు. ఇంజినీరింగ్ స్ర్టీమ్​లో 2,05,351 మంది రిజిస్టర్ చేసుకోగా 1,95,275 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,56,879 మంది క్వాలిఫై అయ్యారు. వీళ్లలో అబ్బాయిలు 94,065 మంది ఉండగా, అమ్మాయిలు 62,814 మంది ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 1,15,332 మంది రిజిస్టర్ చేసుకోగా 1,06,514 మంది పరీక్ష రాశారు. వీరిలో 91,935 మంది క్వాలిఫై అయ్యారు. వీళ్లలో అమ్మాయిలు 65,163 మంది, అబ్బాయిలు 26,772 మంది ఉన్నారు.

ఇంజినీరింగ్‌‌‌‌ టాపర్లు వీరే…

1. సనపల అనిరుధ్‌‌‌‌ (విశాఖపట్నం)

2. ఎక్కంటిపాని వెంకట మణిందర్‌‌‌‌ రెడ్డి (గుంటూరు)

3. చల్లా ఉమేశ్‌‌‌‌ వరుణ్‌‌‌‌ (నందిగామ)

4. అభినిత్‌‌‌‌ మాజేటి

(కొండాపూర్‌‌‌‌, హైదరాబాద్)

5. పొన్నతోట ప్రమోద్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి

(తాడిపత్రి, అనంతపురం)

6. మారదన ధీరజ్ (విశాఖపట్నం)

7. వడ్డే శాన్విత (నల్గొండ)

8. బోయిన సంజన (శ్రీకాకుళం)

9. ప్రిన్స్ బ్రన్హమ్ రెడ్డి (నంద్యాల)

10. మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం)

అగ్రికల్చర్‌‌‌‌ అండ్ మెడికల్ టాపర్లు

1. బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్‌‌‌‌ (తూర్పుగోదావరి)

2. నశిక వెంకటతేజ (చీరాల, ప్రకాశం)

3. సఫల్‌‌‌‌లక్ష్మి పసుపులేటి

(సరూర్‌‌‌‌నగర్‌‌‌‌, రంగారెడ్డి)

4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి, గుంటూరు)

5. బోర వరుణ్‌‌‌‌ చక్రవర్తి (శ్రీకాకుళం)

6. శశిధర్ రెడ్డి (బాలానగర్, రంగారెడ్డి)

7. వి.హర్షిల్ సాయి (నెల్లూరు)

8. డి.సాయి చిద్విలాస్ రెడ్డి (గుంటూరు)

9. జి.వర్షిత (అనంతపురం)

10. కె.ప్రీతమ్ సిద్ధార్థ్

(హిమాయత్ నగర్, హైదరాబాద్)

IPL_Entry_Point