OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-manjummel boys ott streaming on disney plus hotstar manjummel boys digital premiere may 5th manjummel boys ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
May 02, 2024 08:26 AM IST

Manjummel Boys OTT Streaming: రీసెంట్‌గా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా ఏకంగా ఐదు భాషల్లో మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Manummel Boys OTT Release: ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్‌గా చెప్పుకునే సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

పరవ ఫిలింస్ బ్యానర్‌పై మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. ఈ మూవీలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి స్నేహితులుగా ప్రధాన పాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్‌గా 225 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందీ సినిమా. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయగా ఇక్కడా మంచి వసూళ్లు దక్కించుకుంది.

ముందు వేరే ఓటీటీ డేట్

అయితే, మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్‌పై అనేక ప్రచారాలు జరిగాయి. మలయాళంలో సినిమా ప్రదర్శిస్తున్న సమయంలోనే ఓటీటీలోకి ఏప్రిల్ 6 నుంచి స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. అది కూడా కేవలం మలయాళంలో మాత్రమే చిత్రాన్ని రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఓటీటీకి బదులు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.

మరింత క్యూరియాసిటీ

ఏపీ తెలంగాణలో కూడా మంజుమ్మల్ బాయ్స్ రిలీజ్ కావడంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని మే 3 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ, దానికి అనూహ్యంగా రెండు రోజులు ఆలస్యంగా ఓటీటీలోకి రానుంది.

3 రోజుల్లో 5 భాషల్లో

ఇటీవల 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమాను మే 5వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా అందుబాటులో ఉండనుంది. అంటే మరో మూడు రోజుల్లో 5 భాషల్లో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

యువకుల సాహసం ఆధారంగా

2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మల్ యువకుల సాహసం ఆధారంగా సినిమా రూపొందింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 'మంజుమ్మల్ బాయ్స్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ సంచలనం సృష్టించనుందని సదరు ఓటీటీ సంస్థ మేనెజ్‌మెంట్ భావిస్తోంది.

అబ్రహం ఓజ్లర్ ఓటీటీ

ఇదిలా ఉంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇప్పటికీ అనేక జోనర్స్‌లో మలయాళ, తమిళ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే హాట్‌స్టార్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన అబ్రహం ఓజ్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు హాట్‌స్టార్‌లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

సైరన్ ఓటీటీ

ఇదే కాకుండా తమిళంలో రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కి హిట్ కొట్టిన సినిమా సైరన్. ఇది కూడా ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీలో మంచి ఆదర పొందుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ ప్రముఖ పాత్రలు పోషించారు.

IPL_Entry_Point