Sharmila On Budget : హరీష్‌ రావు సీసాలో కేసీఆర్ పాత సారా….-ysrtp president sharmila questions budget allocation for various projects and funds expenditure details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ysrtp President Sharmila Questions Budget Allocation For Various Projects And Funds Expenditure Details

Sharmila On Budget : హరీష్‌ రావు సీసాలో కేసీఆర్ పాత సారా….

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 12:28 PM IST

Sharmila On Budget రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా పోసినట్లు ఉందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు కొత్త సంవత్సరం అని కొత్త సీసా తీసుకొని కేసీఆర్‌ ఫామ్ హౌస్‌కు వెళితే, ఆ సీసాలో ఆయన మామ పాత సార పోశాడని ఎద్దేవా చేశారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల (twitter)

Sharmila On Budget తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా పోసినట్లు ఉందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. బడ్జెట్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కొత్త సంవత్సరం అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌస్‌కు వెళితే , అందులో ఆయన మామ పాత సారా పోశాడని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్దిక మంత్రి గతేడాది బడ్జెట్ కేటాయింపులు,ఖర్చులు మీద సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు 12 వేల కోట్లు కేటాయించారని, దళిత బంధు పథకానికి 17 వేల కోట్లు పెట్టారని, కేటాయింపులకు ,ఖర్చులకు పొంతనే లేదన్నారు.

గతేడాది బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేశారని, ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా అని నిలదీశారు. ప్రభుత్వ పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టక పోతే ఎందుకని ప్రశ్నించాు. బడ్జెట్ ప్రతిపాదనలను వేస్ట్ పేపర్ చేస్తున్నారని, చెత్తబుట్టలో పడేసెలా చేస్తున్నారని మండిపడ్డారు. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదని, ముఖ్యమంత్రి అన్నాక ఇచ్చిన మాటకు విలువ ఉండదా అన్నారు.

తెలంగాణ సీఎం మాటలు మాత్రం కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గడప దాటవని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక...33 ప్రాజెక్ట్ లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. 30 వేల కోట్లు ఖర్చు పెడితే 30 లక్షల ఆయకట్టు పెరుగుతుందని, 8 ఏళ్లుగా ఆ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదన్నారు.

దేవాదుల, కంతనపల్లి,డిండి, SLBC,సీతారామ,నక్కలగండి ప్రాజెక్టులను ఇప్పటికీ ఎందుకు పూర్తి చేయలేక పోయారని షర్మిల ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ముందు పెట్టుకుని అన్ని ప్రాజెక్టులను పక్కన పెట్టారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ గుదిబండలా మారిందన్నారు. లక్షా 20 వేల కోట్ల ప్రాజెక్ట్ మూడేళ్లకు మునిగి పోయిందని, 18 లక్షల ఎకరాలకు అని చెప్పి 50 వేల ఎకరాలకు ఇచ్చారన్నారు. అందుకే కాళేశ్వరం రాష్ట్రానికి ఒక గుదిబండ అని, వైఎస్సార్ హయాంలో 38 వేల కోట్లకు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలి అనుకున్నారని, దానిని మూడింతలు పెంచి...వేల కోట్లు ఖర్చు చేసి 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెట్టిన ఖర్చులో ఒక వంతు పెట్టినా 33 ప్రాజెక్టులు పూర్తి అయ్యేవని, రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయలేదన్నారు. మొత్తం రుణమాఫీ కోసం 36 లక్షల మంది ఎదురు చూస్తున్నారని, ఇప్పటి వరకు 763 కోట్లు మాఫీ చేశారని, గత బడ్జెట్ కేటాయింపులు మాదిరిగా ఈ సారి కూడా బడ్జెట్ లో లెక్కలు చూపించారన్నారు. . రాష్ట్రంలో పూర్తి స్థాయి రుణమాఫీ కావాలి అంటే 19 వేల కోట్లు కావాలని, బడ్జెట్ లో 6 వేల కోట్లు కేటాయించారని, 6 వేల కోట్లతో ఎంత మందికి రుణం మాఫీ చేస్తారన్నారు. ప్రభుత్వం 25లక్షల మంది రైతులను మోసం చేసినట్లేనన్నారు.

రైతు బంధు అని 10 వేలు ఇచ్చి అన్ని సబ్సిడీ పథకాలు ఆపేశారని, 10 వేలు రైతును రారాజు చేస్తే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. సున్నా వడ్డీకి రుణాలు అని మోసం చేస్తున్నారని, 50 లక్షల మంది మహిళలకు 4800 కోట్లు వడ్డీ లు చెల్లించాలని, బడ్జెట్ లో రుణమాఫీ అంశం లేనే లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో క్లారిటీ లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటి వరకు 3600 కోట్లు ఎలా బాకీలు పడ్డారని ప్రశ్నించారు.

ఆరోగ్య శ్రీ కింద నిధులు చూపిస్తారని, బాకీలు మాత్రం 860 కోట్లు ఎలా ఉన్నాయన్నారు. 12 వేల కోట్ల తో డబుల్ బెడ్ రూం అని ఇచ్చింది సగం కూడా లేదన్నారు. కేసీఆర్ కడతామని చెప్పిన 2 లక్షల ఇళ్లలో 25 వేల ఇళ్లకు మాత్రమే గృహప్రవేశం చేశారని, ఈ సారి కేటాయించిన 12 వేల కోట్లతో అన్ని ఇల్లులు కట్టించి ఇస్తారా లేదా అని నిలదీశారు. లక్షా 91 వేల ఉద్యోగాలలో ఇచ్చింది కేవలం 65 వేలు మాత్రమేనని, నోటిఫికేషన్ లలో ఇప్పుడు 45 వేల ఉద్యోగాలకు ఇచ్చారని, ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్ కింద లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా, ఒక్కరికీ లోన్ మంజూరు కాలేదన్నారు.

తెలంగాణలో ఆసరా పెన్షన్ ల కోసం 11 లక్షల ధరకాస్తు పెట్టుకుంటే వారిని పట్టించుకోవడం లేదని, తెలంగాణ ప్రజలకు కేసీఅర్ వెన్నుపోటు పొడిచారని, బడ్జెట్ చూస్తే కేసీఆర్ ప్రజలను ఎంత మోసం చేశాడో అర్థం అవుతుందన్నారు.

IPL_Entry_Point

టాపిక్