TSRTC New Buses: కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు వచ్చేశాయ్-tsrtc new buses inaugurated by minister ajay kumar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tsrtc New Buses Inaugurated By Minister Ajay Kumar

TSRTC New Buses: కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు వచ్చేశాయ్

Dec 24, 2022, 10:27 PM IST Mahendra Maheshwaram
Dec 24, 2022, 10:27 PM , IST

  • TSRTC's New Super Luxury Buses: ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్‌ఆర్టీసీ. శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ  ప్రకాశ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 50 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ... త్వరలోనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు రాబోతున్నాయన్నారు. 36 రిక్లైనింగ్‌ సీట్ల సామర్థ్యం కల ప్రతి బస్సులో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌, టీవీ సదుపాయంతో పాటు బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ట్రాకింగ్‌ వ్యవస్థ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు.

(1 / 4)

ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 50 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ... త్వరలోనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు రాబోతున్నాయన్నారు. 36 రిక్లైనింగ్‌ సీట్ల సామర్థ్యం కల ప్రతి బస్సులో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌, టీవీ సదుపాయంతో పాటు బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ట్రాకింగ్‌ వ్యవస్థ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు.(twitter)

రూ.392 కోట్ల వ్యయంతో అధునాతన 1,016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్టీసీ యాజమాన్యం ఆర్డర్‌ ఇచ్చింది. ఈ బస్సులను మార్చి 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇందులో భాగంగా  తొలివిడత కింద కొనుగోలు చేస్తున్న 760కి పైగా బస్సుల్లో  ఇవాళ 50 ప్రారంభించారు.   

(2 / 4)

రూ.392 కోట్ల వ్యయంతో అధునాతన 1,016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్టీసీ యాజమాన్యం ఆర్డర్‌ ఇచ్చింది. ఈ బస్సులను మార్చి 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇందులో భాగంగా  తొలివిడత కింద కొనుగోలు చేస్తున్న 760కి పైగా బస్సుల్లో  ఇవాళ 50 ప్రారంభించారు.   (twitter)

ప్రయాణికుల సంతోషం కోసం కొత్త బస్సులను కొనుగోలు చేశామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. లాభాలు లేకపోయినా నష్టాలు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 100 కోట్ల నష్టాలు గతంలో ఉండేదన్న ఆయన... ఇప్పుడు 70 కోట్లకు తగ్గిందని వెల్లడించారు. టీఎస్ఆర్టీసి లో ఛార్జీలు పెంచలేదని.. కేవలం డీజిల్ సెస్ మాత్రమే పెంచామన్నారు. డ్రైవర్లు సంక్షేమం కోసం ఆర్టీసి హాస్పిటల్ ను మాడిఫై చేశామని.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తార్నాక హాస్పిటల్ మారిందని గుర్తు చేశారు. 

(3 / 4)

ప్రయాణికుల సంతోషం కోసం కొత్త బస్సులను కొనుగోలు చేశామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. లాభాలు లేకపోయినా నష్టాలు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 100 కోట్ల నష్టాలు గతంలో ఉండేదన్న ఆయన... ఇప్పుడు 70 కోట్లకు తగ్గిందని వెల్లడించారు. టీఎస్ఆర్టీసి లో ఛార్జీలు పెంచలేదని.. కేవలం డీజిల్ సెస్ మాత్రమే పెంచామన్నారు. డ్రైవర్లు సంక్షేమం కోసం ఆర్టీసి హాస్పిటల్ ను మాడిఫై చేశామని.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తార్నాక హాస్పిటల్ మారిందని గుర్తు చేశారు. (twitter)

ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని.. అందుకు అనుగుణంగా కొత్త బస్సులను తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. కొత్త బస్సుల్లో ఆధునాతన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.  రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్ట్రానిక్ బస్సులను గ్రేటర్ లో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.మొత్తం 300 ఎలక్ట్రిక్  బస్సులు రాబోతున్నాయని ప్రకటించారు.   

(4 / 4)

ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని.. అందుకు అనుగుణంగా కొత్త బస్సులను తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. కొత్త బస్సుల్లో ఆధునాతన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.  రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్ట్రానిక్ బస్సులను గ్రేటర్ లో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.మొత్తం 300 ఎలక్ట్రిక్  బస్సులు రాబోతున్నాయని ప్రకటించారు.   (twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు