TS PECET 2023: టీఎస్ పీఈసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ముఖ్య తేదీలివే
TS PECET 2023 Updates: తెలంగాణ పీఈసెట్ 2023 దరఖాస్తులకు కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. 16 వరకు పీఈసెట్ గడువును పెంచారు.
TS PECET 2023 Registration Dates: తెలంగాణ పీఈసెట్ 2023కి సంబంధించి అప్డేట్ ఇచ్చారు అధికారులు. దరఖాస్తుల గడువును పెంచారు. బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా పీఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక గడువును పొడిగించే అవకాశాలు లేవని...ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్పష్టం చేశారు. ఏవరైనా విద్యార్థులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు
టీఎస్ పీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 13వ తేదీన విడుదల అయింది. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా... మే 6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అయితే ఈ తేదీని ఇప్పుడు మే 16వ తేదీ వరకు పొడిగించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 500, మిగతా కేటగిరిల వారికి రూ. 900గా ఫీజు నిర్ణయించారు. రూ. 5 వేల ఆలస్య రుసుం మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 26వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. జూన్ మూడో వారంలో ఫలితాలు రిలీజ్ అవుతాయి.
NOTE: టీఎస్ పీఈసెట్ 2023 సంబంధించి దరఖాస్తు చేసుకోవటం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవటం, ఫలితాలు, ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవటంతో పాటు మరికొన్ని అప్డేట్స్ కోసం www.pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్…
TSPSC Group-4 Exam : తెలంగాణ గ్రూప్-4(Group-4) అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ(TSPSC) మరో అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు ఈనెల 9వ తేదీ నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు గాను 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షను జులై 1న నిర్వహిస్తుంది.
టీఎస్పీఎస్సీ గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అభ్యర్థులు అప్లికేషన్ పూర్తిచేసినప్పుడు తప్పులు చేశారు. ఈ తప్పుల సవరణకు అభ్యర్థుల నుంచి వినతుల రావడంతో... టీఎస్పీఎస్సీ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో గ్రూప్ 4 అభ్యర్థుల అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 1న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ(TSPSC) ఇప్పటికే ప్రకటించింది. జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.