TS LAWCET 2022: లాసెట్‌ తొలి విడత సీట్ల కేటాయింపు - ఇలా చెక్ చేేసుకోండి-ts lawcet 1st phase seat allotment results check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Lawcet 1st Phase Seat Allotment Results Check Here

TS LAWCET 2022: లాసెట్‌ తొలి విడత సీట్ల కేటాయింపు - ఇలా చెక్ చేేసుకోండి

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 08:09 AM IST

TS LAWCET Seat Allotment: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌ ముగిసింది. ర్యాంక్ ల ఆధారంగా కాలేజీలను కేటాయించారు. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు.

లా సీట్ల కేటాయింపు
లా సీట్ల కేటాయింపు

TS LAWCET 1st Phase Seat Allotment 2022: లా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఈ మేరకు శనివారం టీఎస్‌ సెట్స్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌బాబు వివరాలను ప్రకటించారు. ఎల్‌ఎల్‌బీ (3 ఏళ్లు), ఎల్‌ఎల్‌బీ (5 ఏళ్లు), ఎల్‌ఎల్‌ఎంలలో 6,724 సీట్లు ఉండగా.. మొదటి దశలో 5,747 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మొదటి దశలో 12,301 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో 5,747 సీట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

సీట్లు వచ్చిన విద్యార్థులు జాయినింగ్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని.. యూనియన్‌ బ్యాంకు బ్రాంచీల్లో ఫీజులు చెల్లించాలని వివరించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28 నుంచి డిసెంబరు 3 వరకు రిపోర్ట్‌ చేయాలన్నారు. నవంబరు 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ పై ప్రకటన రావాల్సి ఉంది.

ఇలా చెక్ చేసుకోండి...

అభ్యర్థులు http://lawcetadm.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Phase I Allotments - Candidate Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి

మీ రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ ఎంట్రీ చేసి క్లిక్ చేయాలి

మీకు కేటాయించిన కాలేజీ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

NOTE:

సీట్ల కేటాయింపు, ఇతర అంశాలపై ఏమైనా సందేహాలు ఉంటే 040-71903016 నెంబర్ ను సంప్రదించవచ్చు.

తెలంగాణలో న్యాయవిద్యలో ప్రవేశాలకు సంబంధించి జులై 21, 22 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్ష నిర్వహించారు. ఆగస్టు 17వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మూడేళ్ల లా కోర్సుకు 15,031 మంది ఉత్తీర్ణత సాధించారు. ఐదేళ్ల కోర్సుకు 4256 మంది ఉత్తీర్ణులయ్యారు.

IPL_Entry_Point