TS LAWCET Counselling : లాసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే-check here for lawcet and pglcet counselling schedule date and other details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Check Here For Lawcet And Pglcet Counselling Schedule Date And Other Details

TS LAWCET Counselling : లాసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 11:20 PM IST

TS LAWCET and PGLCET Admissions : తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. నవంబర్ 22న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్లను కేటాయిస్తారు. న‌వంబ‌ర్ 28 నుంచి త‌ర‌గ‌తులు మెదలవుతాయి.

టీఎస్ లాసెట్ కౌన్సెలింగ్
టీఎస్ లాసెట్ కౌన్సెలింగ్

తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల‌కు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ నడుస్తోంది. షెడ్యూలు ప్రకారం చూసుకుంటే.. న‌వంబ‌ర్ 2 నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల పరిశీలన అయింది. న‌వంబ‌ర్ 18, 19 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు న‌మోదు చేయాలి. ఆ తర్వాత అభ్యర్థులకు న‌వంబ‌ర్ 22న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్లను కేటాయిస్తారు. న‌వంబ‌ర్ 28 నుంచి ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం త‌ర‌గ‌తులు మెుదలవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు నవంబర్ 18, 19 వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత దశలో సీట్లను కేటాయిస్తారు. సీట్లను పొందిన వారు ఫీజు చెల్లింపు చలనా తీయాలి. జాయినింగ్ రిపోర్ట్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

కేటాయించిన కళాశాలలో నిర్ణీత వ్యవధిలో రిపోర్టింగ్ చేయాలి. సంబంధిత కళాశాలలో అభర్థులకు ఇంకోసారి ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. సీట్ల కేటాయింపుకు సంబంధించిన అలాంట్‌మెంట్ ఆర్డన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. న‌వంబ‌ర్ 28 ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం తరగతులు ప్రారంభమవుతాయి.

మెుదటి విడతలో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి తుది విడత కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తారు. తెలంగాణలో న్యాయవిద్యలో ప్రవేశాలకు సంబంధించి జులై 21, 22 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్ష నిర్వహించారు. ఆగస్టు 17వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మూడేళ్ల లా కోర్సుకు 15,031 మంది ఉత్తీర్ణత సాధించారు. ఐదేళ్ల కోర్సుకు 4256 మంది ఉత్తీర్ణులయ్యారు.

IPL_Entry_Point