Amit Shah Tour : ఇవాళ తెలంగాణకు అమిత్ షా... చేవెళ్ల వేదికగా BJP ఎన్నికల శంఖారావం!-today amit shah to address public meeting in telangana on sunday ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Today Amit Shah To Address Public Meeting In Telangana On Sunday

Amit Shah Tour : ఇవాళ తెలంగాణకు అమిత్ షా... చేవెళ్ల వేదికగా BJP ఎన్నికల శంఖారావం!

HT Telugu Desk HT Telugu
Apr 23, 2023 09:33 AM IST

Amit Shah Hyderabad Tour: బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా చేవెళ్లలో తలపెట్టిన పార్టీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.

అమిత్ షా
అమిత్ షా

Home Minister Amit Shah Hyd Tour Schedule: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభకు హాజరుకాన్నున్నారు. ఈ బహిరంగ సభ నుంచే అమిత్ షా ఎన్నికలకు సమర శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల కిందట రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా… ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో కూడా మంతనాలు జరిపారు. అయితే ఈసారి మాత్రం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయనున్న భారీ సభకు హాజరుకానున్న నేపథ్యంలో అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు అమిత్‌ షా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం అవుతుంది. ఇందులో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అనంతరం 5.15 గంటలకు చేవెళ్ల సభకు ప్రయాణమవుతారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి రాత్రి 7.45 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని ల్లీకి పయనమవుతారు.

ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. మిషన్ 90 టార్గెట్ కూడా ఇదే..! ఇప్పట్నుంచే ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంపై చూసే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో చేపట్టాల్సిన చర్యలపై కూడా లోతుగానే చర్చిస్తోంది. ఈ సీట్లలో బలమైన అభ్యర్థులను తెరపైకి తీసుకురావటంతో పాటు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా కసరత్తు చేస్తోంది. ఇక చేవెళ్ల సభ వేదికగా భారీగా చేరికలు ఉంటాయన్న లీకులు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు కమలం కండువా కప్పుకొనే ఛాన్స్ ఉందన్న చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే దీనిపై బీజేపీ నేతల నుంచి క్లారిటీ లేదు. ఫలితంగా చేరికల విషయంపై ఉత్కంఠ నెలకొందనే చెప్పొచ్చు.

మొత్తంగా మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో....బీజేపీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. ఇక సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. మరోవైపు జనసమీకణ కూడా ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం