Road accident Jagtial : ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మహిళలు దుర్మరణం
3 dead in road accident: జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
road accident in jagtial district: ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వెల్గటూర్ మండలం కృష్ణారావుపేటలో వేగంగా వచ్చిన ఓ కారు... ఒక్కసారిగా ఆటోను బలంగా ఢీకొట్టింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక చనిపోయవారిని ధర్మపురి మండలానికి చెందిన వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఇవాళ యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా - లక్నో ఎక్స ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... మరో 42 మంది గాయపడ్డారు. ఇందులో 7 ఏళ్ల చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
గోరఖ్ పూర్ నుంచి ఆజ్మీర్ కు స్లీపర్ బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు - ట్రక్కు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు యూపీ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 02.10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు.