Terror Attack : పాకిస్థాన్‌ నుంచి గ్రెనేడ్‌లు.. హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర-three arrested persons under uapa planned lone wolf terror attack in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Three Arrested Persons Under Uapa Planned Lone Wolf Terror Attack In Hyderabad

Terror Attack : పాకిస్థాన్‌ నుంచి గ్రెనేడ్‌లు.. హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర

HT Telugu Desk HT Telugu
Feb 05, 2023 05:30 PM IST

NIA On Terror Attack : హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ కేసులో గతంలోనే ముగ్గురు అరెస్టు అయ్యారు.

ఎన్ఐఏ
ఎన్ఐఏ

హైదరాబాద్‌(Hyderabad)లో ఉగ్రదాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద మొహమ్మద్ జాహెద్, మాజ్ హసన్ ఫరూక్, సమీయుద్దీన్ అనే ముగ్గురు వ్యక్తులు గతంలో అరెస్టు అయ్యారు. జాహెద్ హైదరాబాద్‌లో పేలుళ్లకు, దాడులకు ప్లాన్ చేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

ఎఫ్‌ఐఆర్‌లో ఈ ముగ్గురు మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు బహిరంగ సభలు, ఊరేగింపులపై హ్యాండ్ గ్రెనేడ్ లు విసరాలని ప్లాన్ చేసినట్టుగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అనేక ఉగ్రవాద(Terror) సంబంధిత కేసుల్లో నిందితుడైన అబ్దుల్ జాహెద్ అలియాస్ జాహెద్ అలియాస్ మహ్మద్‌కు పాకిస్థాన్‌కు చెందిన వారు ఈ పనిని అప్పగించారు. జాహెద్ ఆదేశాల మేరకు మాజ్, సమీయుద్దీన్ తోపాటుగా చాలా మంది యువకులను రిక్రూట్ చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్ లో ప్రస్తావించారు.

2022 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నినందుకు మాజ్ హసన్ ఫరూక్, సమీయుద్దీన్‌లపై NIA కేసులు నమోదు చేసింది. వీరిపై UAPA కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.., జాహెద్ పాకిస్థానీ హ్యాండ్లర్ల సూచనల మేరకు హైదరాబాద్ సిటీలో పేలుళ్లు, బీభత్సం సృష్టించడానికి దాడులకు కుట్ర పన్నాడు.

హైదరాబాద్ పోలీసులు అక్టోబర్ 1, 2022 న జాహెద్ దగ్గర రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 3,91, 800 స్వాధీనం చేసుకున్న తర్వాత UAPA ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. జాహెద్‌కు సూచనలు ఇస్తున్న పాకిస్థాన్ హ్యాండ్లర్లు లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ వంటి సంస్థలకు చెందినవారు. విచారణ చేస్తుంటే.. విషయాలు వెల్లడయ్యాయి.

హైదరాబాద్‌ లో పేలుళ్లకు కుట్రపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ NIA కు బదిలీచేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం