Allegation On MLA Rajaiah : ఎమ్మెల్యే రాజయ్యకు షాక్..! DGP కి రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ -telangana state commission for women orders probe janakipuram sarpanch allegation on brs mla rajaiah ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana State Commission For Women Orders Probe Janakipuram Sarpanch Allegation On Brs Mla Rajaiah.

Allegation On MLA Rajaiah : ఎమ్మెల్యే రాజయ్యకు షాక్..! DGP కి రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ

HT Telugu Desk HT Telugu
Mar 12, 2023 12:18 PM IST

Sarpanch Allegation on MLA Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీకి లేఖ రాసినట్లు ప్రకటన జారీ చేసింది.

ఎమ్మెల్యే రాజయ్యకు షాక్
ఎమ్మెల్యే రాజయ్యకు షాక్

Sarpanch Allegation on BRS MLA Thatikonda Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వేధిస్తున్నారని ఆరోపిస్తూ... అదే పార్టీకి చెందిన సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ కాల్స్ చేస్తూ ఒంటరిగా కలవాలని వేధిస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. ఇదీ కాస్త బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దీనిపై స్పందించారు ఎమ్మెల్యే రాజయ్య. కుట్రలో భాగంగానే తనపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజయ్యపై వచ్చిన ఆరోపణల అంశంపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది.

ఎమ్మెల్యే రాజయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డీజీపీకి కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి లేఖ రాశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరినట్లు మహిళా కమిషన్ ట్వీట్ చేసింది.

సర్పంచ్ తీవ్ర ఆరోపణలు... ఏం జరిగింది..?

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రెండేళ్లకుపైగా తనను వేధిస్తున్నారని హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం జానకిపురం సర్పంచి కురుసపల్లి నవ్య ఆరోపించారు. ఎమ్మెల్యే రాజయ్య ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్‌ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం భర్తతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె... ఈ ఆరోపణలు చేశారు. ఫోన్ రికార్డింగ్ లు కూడా ఉన్నాయని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నామని సర్పంచ్ చెప్పారు. తమ గ్రామానికి మొదటి నుంచీ నిధులు ఇవ్వడంలేదని ఆరోపించారు. మీరూ ఎమ్మెల్యే వద్దకు వస్తే గ్రామానికి నిధులు, మీ అవసరాలు తీరుస్తారంటూ... బీఆర్ఎస్ కు చెందిన ఓ మహిళ నేత కూడా ఒకరు తనని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. సమయం చెప్పినప్పుడు ఆమె పేరును బయటపెడుతాని చెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం