Minister Errabelli Brother : టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి బ్రదర్ బైబై.. 'ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా'-telangana politics errabelli pradeep rao resigns to trs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Politics Errabelli Pradeep Rao Resigns To Trs

Minister Errabelli Brother : టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి బ్రదర్ బైబై.. 'ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా'

HT Telugu Desk HT Telugu
Aug 07, 2022 07:58 PM IST

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్ఎస్‌కి షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కొంతకాలంగా.. పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే ప్రచారం జోరుగా సాగింది. బుజ్జగింపు ప్రయత్నాలు జరిగినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఆదివారం రోజున మీడియా సమావేశంలో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పై విమర్శలు చేశారు.

రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన ఎర్రబెల్లి ప్రదీప్.. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే నరేందర్‌ రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. చీరుస్తా, పాతరేస్తా అంటే పార్టీలో ఉండాలా అని ప్రశ్నించారు. తన సహకారం లేకుండా నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందినది నిజమైతే.. పదో తారీకు వరకు రాజీనామా చేయాలన్నారు. మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. బతికున్న రోజులు ఆయనకు సేవకుడిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు.

'25 వేల కుటుంబాలను ఆదుకుంటే ప్రజలు ఆదరిస్తారు అనుకుంటే 4 వేల కోట్లతో అభివృద్ధి చేశాను అనుకుంటే రాజీనామా చేయండి. 10వ తేదీ వరకు రాజీనామా చేయకుంటే ఎక్కడికి రమ్మన్నా వస్తా. బహిరంగ చర్చకు సిద్ధం. 4 వేల కోట్లు ఎక్కడ పెట్టి అభివృద్ధి చేశారో చెప్పండి. పార్టీలో ప్రాధాన్యత తగ్గించినా ఓపికగా భరించాం. ఎమ్మెల్సీ ఆశ జూపి అవమానం చేశారు. ఏ పార్టీ ఆదరించకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తా.' అని స్పష్టం చేశారు.

IPL_Entry_Point