Revanth Reddy : ఎన్‌ఎస్‌యుఐ నాయకుడికి రేవంత్ పరామర్శ-telangana pcc chief revanth reddy visited nsui leader who was attacked by brs party leaders in warrangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Pcc Chief Revanth Reddy Visited Nsui Leader Who Was Attacked By Brs Party Leaders In Warrangal

Revanth Reddy : ఎన్‌ఎస్‌యుఐ నాయకుడికి రేవంత్ పరామర్శ

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 01:08 PM IST

Revanth Reddy వరంగల్‌లో‌‌ దాడికి గురైన ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు పవన్‌ను టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు రవి, మాజీ ఎంపీ రాజయ్య తదితరులు పరామర్శించారు. ఆసుపత్రి నుంచి పాదయాత్రగా కమిషనరేట్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ దాడి చేయించినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఎన్‌ఎస్‌యుఐ నాయకుడిని పరామర్శిస్తున్న రేవంత్ రెడ్డి
ఎన్‌ఎస్‌యుఐ నాయకుడిని పరామర్శిస్తున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ గూండాల రాజ్యం నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో రౌడీ కార్యక్రమాలకు కథానాయకుడు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే అని మండిపడ్డారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి బానిసలని ఆరోపించిన రేవంత్ రెడ్డి, వారంతా మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమ సంపాదన కోసం ల్యాండ్ స్కాములు , సాండ్ స్కాములు, మైనింగ్, అత్యాచారాలలో కూడా బీఆర్‌ఎస్‌ నేతలే ఉంటున్నారని మండిపడ్డారు. రాజకీయంగా వారికి నూకలు చెల్లాయనే ఎమ్మెల్యే ముఠా ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు పవన్ ను చంపాలని ప్రయత్నించారని ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన పవన్ చావు నుంచి తప్పించుకున్నాడని, చైతన్య వంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గమన్నారు.

రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ విధి నిర్వర్తించడం లేదని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే తనపై దాడి జరిగిందని పవన్ చెప్పాడన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు , అతని ముఠా సభ్యులను అరెస్టు చేయాల్సిన పోలీసులు వారిని కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

పోలీసులు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు శాశ్వతం కాదన్నారు. క్రిమినల్ చర్యలను ఉక్కు పాదంతో అణచాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

దాడులు చేసి వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తున్నా.. పోలీసులు నిస్సహాయంగా ఉండటం మంచిది కాదన్నారు. వరంగల్‌లో జరిగిన దాి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన కాదని, కాంగ్రెస్ పార్టీ యాత్రపైనే దాడి జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు.

రాస్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన డీజీపీ వైపు నుంచి స్పందన లేదని, దీన్ని కాంగ్రెస్ శ్రేణులు సహించరన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించాలని సూచించారు. కాంగ్రెస్ నిరసన సెగ కేసీఆర్‌కు తాకాలన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, అతని గంజాయి ముఠాపై హత్యానేరం కింద అరెస్టు చేయాల

ఈ మొత్తం ఘటనకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కారణం

IPL_Entry_Point