TSMFC Subsidy Loans: మైనారిటీలకు సబ్సిడీ లోన్లు.. ఎల్లుండి నుంచే దరఖాస్తులు-telangana minority welfare department to provide subsidy loans to minorities ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsmfc Subsidy Loans: మైనారిటీలకు సబ్సిడీ లోన్లు.. ఎల్లుండి నుంచే దరఖాస్తులు

TSMFC Subsidy Loans: మైనారిటీలకు సబ్సిడీ లోన్లు.. ఎల్లుండి నుంచే దరఖాస్తులు

HT Telugu Desk HT Telugu
Dec 17, 2022 10:37 PM IST

Subsidy Loans to Minorities: రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది మైనారిటీలకు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద.. బ్యాంక్‌ సబ్సిడీ రుణాలు ఇవ్వనుంది. ఈ మేరకు ఎల్లుండి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మైనారిటీలకు సబ్సిడీ లోన్లు
మైనారిటీలకు సబ్సిడీ లోన్లు (TSFMC)

Telangana Minority Welfare Department Subsidy Loans: మైనార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. 2022-23 ఏడాది కింద సబ్సిడీ రుణాల ఇవ్వనుంది. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఇచ్చే ఈ సబ్సిడీ లోన్ల మంజూరుకు ఇప్పటికే సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సబ్సిడీ రుణాల దరఖాస్తు తేదీలు, అర్హత వివరాలను కూడా వెల్లడించారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది మైనారిటీలకు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద.. బ్యాంక్‌ సబ్సిడీ రుణాలివ్వనున్నారు. మొత్తం రూ.50 కోట్ల వ్యయంతో నిరుద్యోగులకు ఈ ఆర్థిక సాయం చేస్తారు. ఈ డబ్బుతో లబ్ధిదారులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు వ్యాపారాలు చేసుకునేందుకు ఇస్తారు. మైనారిటీ వర్గాల్లో పేదల జీవన ప్రమాణాలను పెంచటమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.

అర్హతలు ఇవే...

దరఖాస్తు చేసుకునేవారు మైనారిటీ(ముస్లింలు, సిక్కులు, పార్శీలు, బౌద్ధులు, జైనులు ) కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలి.

ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి.

వయస్సు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే కుటుంబ వార్షిక ఆదాయం రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాలైతే వార్షిక ఆదాయం రూ.2,00,000 లోపు ఉండాలి.

ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

డిసెంబరు 19, 2022 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు జనవరి 5, 2023 తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈ పథకానికి సంబంధించిన ఎవరికైనా సందేహాలు ఉంటే 7337534111 నెంబర్‌కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

NOTE:లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలతో పాటు ఇతర అప్డేట్స్ ను తెలుసుకోవచ్చు.

IPL_Entry_Point