TS Inter Vocational Supply Time Table : జూన్ 12 నుంచి ఇంటర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు, టైం టేబుల్ ఇదే!-telangana intermediate vocational supplementary exam time table 2023 out date here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Vocational Supply Time Table : జూన్ 12 నుంచి ఇంటర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు, టైం టేబుల్ ఇదే!

TS Inter Vocational Supply Time Table : జూన్ 12 నుంచి ఇంటర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు, టైం టేబుల్ ఇదే!

Bandaru Satyaprasad HT Telugu
May 20, 2023 08:27 PM IST

TS Inter Vocational Supply Time Table : తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 12 నుంచి 22 వరకు వివిధ కోర్సులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు (HT )

TS Inter Vocational Supply Time Table : తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ కోర్సుల అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు జూన్ 12 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పరీక్ష జరగనున్నాయి. జూన్ 5 నుంచి 9 వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ కోర్సులకు కూడా జూన్ 12 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. రెగ్యూలర్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే నిబంధనలే ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

రెగ్యులర్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇలా

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. జూన్ 12 నుంచి 22వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు. ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. జూన్ 5 నుంచి 9 వరకు రెండు సెషన్స్ లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు

  • 12-06-2023(సోమవారం) : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • 13-06-2023(మంగళవారం) : ఇంగ్లీష్ పేపర్-1
  • 14-06-2023(బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • 15-06-2023(గురువారం): మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ-1
  • 16-06-2023(శుక్రవారం) : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ -1
  • 17-06-2023(శనివారం) : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్ -1
  • 19-06-2023 (సోమవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1 , మ్యాథ్స్ పేపర్-1(BiPC విద్యార్థులకు)
  • 20-06-2023(మంగళవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియ్ సప్లిమెంటరీ షెడ్యూల్

  • 12-06-2023(సోమవారం) : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
  • 13-06-2023(మంగళవారం) : ఇంగ్లీష్ పేపర్-II
  • 14-06-2023(బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
  • 15-06-2023(గురువారం): మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ-II
  • 16-06-2023(శుక్రవారం) : ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ -II
  • 17-06-2023(శనివారం) : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II
  • 19-06-2023 (సోమవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -II , మ్యాథ్స్ పేపర్-II(BiPC విద్యార్థులకు)
  • 20-06-2023(మంగళవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ పేపర్-II

21-06-2023 (బుధవారం ) ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పేపర్

22-06-2023 (గురువారం) ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎన్విరాన్మెంటల్ ఎక్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.

IPL_Entry_Point