Telangana Congress : మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ ప్రణాళిక కమిటీ సమావేశం
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే.. మునుగోడు నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. గురువారం సైతం.. ముఖ్యనేతలు భేటీ కానున్నారు.
_1660141838571_1660141855562_1660141855562.png)
గాంధీభవన్ లో మునుగోడు నియోజకవర్గ నేతలతో నాయకుల సమావేశం ముగిసంది. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్ తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆశావహులను పిలిచి మునుగోడు విషయాలపై ఆరా తీశామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పామన్నారు. 'ఏఐసీసీ నేతలతో మరోసారి సమావేశం ఉంటుంది. గురువారం ముఖ్య నేతలతో గాంధీభవన్ లో మీటింగ్ ఉంది.' అని మహేశ్ చెప్పారు.
గురువారం ఉదయం 10.30 గంటలకు మునుగోడు ఉప ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ కార్యదర్శి మణిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కమిటీ కన్వీనర్ మధు యాష్కీతో పాటు సభ్యులు పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్లతో సమావేశం జరగనుంది. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల అంశంపైన చర్చిస్తారు.
సంబంధిత కథనం