Minister Mallareddy : 'నాలాగా ఫిట్ గా ఉండాలి'.. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దన్న మల్లారెడ్డి
Minister Mallareddy Latest News: పోలీస్ శాఖపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దంటూ పోలీస్ బాస్ డీజీపీని కోరారు.
Minister Mallareddy on Police Department: మంత్రి మల్లారెడ్డి... తన మాటలతో జోష్ తెప్పిస్తుంటారు. 'కష్టపడ్డా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. సమయం దొరికితే చాలు... ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ను తెగ పొగిడేస్తుంటారు. తన పంచ్ డైలాగ్ లతో ప్రతిపక్ష పార్టీలను కూడా ఎకిపారేస్తుంటారు. అయితే ఇదిలా ఉంటే.... పోలీస్ శాఖపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి, సాక్షాత్తూ హోంశాఖ మంత్రి, డీజీపీ ముందే తన మనసులోని మాటలను చెప్పేశారు. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని వారిని కోరారు.
ట్రెండింగ్ వార్తలు
మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి... పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసులంతా తన మాదిరిగా ఫిట్ గా ఉండాలంటూ సూచించారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని కొనియాడారు. మన రాష్ట్ర పోలీసులు బాగా పని చేస్తున్నారన్న ఆయన... కేసులను త్వరగా పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు.
రాచకొండ సీపీకి సవాల్...
ఇదిలా ఉంటే... రాచకొండ డీఎస్ చౌహన్ కి మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 12వ తేదీన తెలంగాణ రన్ 1లక్ష మంది తో నిర్వహించి తెలంగాణ లో రికార్డ్ సాధిస్తామని అని అన్నారు. ఈ రన్ లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సీపీతో చేతులు కలిపి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ మధ్యనే పోలవరం ప్రాజెక్ట్ పై కూడా మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నిర్మాణం పూర్తిచేసేది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. అందరూ తెలంగాణ వైపే చూస్తున్నారని, ఆంధ్ర ప్రదేశ్ అవుట్ అయిపోయిందని అన్నారు. మహారాష్ట్రలో లక్షలాది మంది బీఆర్ఎస్‌కు బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. ‘ఆంధ్రలో కుల రాజకీయాలు చేస్తున్నారు. రెడ్డి, కాపు, కమ్మ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలను పట్టించుకునే వారు లేరు. పోలవరం కట్టేది కేసీఆరే. విశాఖ ఉక్కును కాపాడుకునేది కేసీఆరే..’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారని, కేసీఆర్ అందిస్తున్న పాలన అంతటా రావాలని చూస్తున్నారని కామెంట్స్ చేశారు.