KTR | అందరూ అలానే అంటే ఎలా.. దేశానికే మనం ఆదర్శంగా ఉండాలి-minister ktr visits ambedkar statue works in hyderabad pv marg ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Ktr Visits Ambedkar Statue Works In Hyderabad Pv Marg

KTR | అందరూ అలానే అంటే ఎలా.. దేశానికే మనం ఆదర్శంగా ఉండాలి

HT Telugu Desk HT Telugu
Apr 13, 2022 04:10 PM IST

దళిత బంధుపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పథకం సఫలమైతే.. దేశం మెుత్తం తెలంగాణ వైపు చూస్తుందని.. కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలతో దళితులు అభివృద్ధి చెందాలని కోరారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ (twitter)

హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన డా. బీ.ఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పీవీ మార్గ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహా ప‌నుల‌ను పరిశీలించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబ‌ర్ లోగా ప్రతిష్టించనున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకంపై మాట్లాడారు. దళిత బంధు సఫలమైతే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దళిత బంధు ద్వారా వచ్చే డబ్బులను లబ్ధిదారులు.. సరైన వాటికి ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం 55 అడుగులు బేస్, 125 అడుగులు విగ్రహం రెడీ అవుతుందని కేటీఆర్ చెప్పారు. డిసెంబర్ నాటికి విగ్రహం పని పూర్తి అవుతుందని పేర్కొన్నారు. మన దేశ ప్రజలకి ఈ ప్రాంతం స్ఫూర్తి కాబోతోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకి ఎక్కడా భంగం కలిగకుండా అంబేడ్కర్ బాటలో నడుస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

'దళితబంధు లబ్ధిదారులు కొత్తగా ఆలోచిస్తే.. సంపద సృష్టి జరుగుతుంది. తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. చాలామంది మేం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొంటామని చెబుతున్నారు. అలా చేస్తే.. అలా చేస్తే ప్రభుత్వ ఉద్దేశం ఎలా సఫలం అవుతుంది? డిక్కీ సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల తయారీ చేసేందుకు కృషి చేస్తున్నాం. నిధులను పక్కాగా ప్లాన్ చేసుకుని.. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.' అని కేటీఆర్ అన్నారు.

పథకాల అమలులో అందరినీ కలుపుకొని వెళ్దామని కేటీఆర్ అన్నారు. దళితబంధును సమర్థంగా అమలు చేసి.. దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. సత్తా ఉన్నప్పుడు.. పది మందికి అవకాశాలు ఇవ్వగలగలాన్నారు. ఇతరులను విమర్శలు చేయడమే.. కొంతమంది పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరాశ, నిస్పృహల నుంచి యువత బయటపడాలని కోరారు. ప్రభుత్వం అవకాశాలు ఇచ్చినప్పుడు యువత అందిపుచ్చుకోవాలన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్