KTR | దళిత బంధు తరహా పథకం కేవలం దళితులకే కాదు.. మిగతా వర్గాలకు కూడా-minister ktr distributes dalita bandhu scheme funds in rajanna siricilla district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr | దళిత బంధు తరహా పథకం కేవలం దళితులకే కాదు.. మిగతా వర్గాలకు కూడా

KTR | దళిత బంధు తరహా పథకం కేవలం దళితులకే కాదు.. మిగతా వర్గాలకు కూడా

HT Telugu Desk HT Telugu
Apr 14, 2022 06:24 PM IST

దళిత బంధుతో దళితుల రూపు రేఖలు మార్చడానికి ఆలోచిస్తున్న ఒకే ఒక నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని ఎదగాలని కోరారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

సిరిసిల్ల జిల్లాకి చెందిన 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ ను ప్రారంభించారు. దళిత బంధు విజయవంతం కావాలని కోరారు. దళిత బంధు నిధులతో వాహనాలపైనే.. దృష్టి పెట్టకూడదని పేర్కొన్నారు. దళితుల రూపు రేఖలు మార్చేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ నిధులతో వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి సంపదను రెట్టింపు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా దళితబంధు నిధులతో పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నారు.

దళితబంధు నిధులతో రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. మంచి పనులు చేసేందుకు లక్ష తొంభై అడ్డంకులు ఉంటాయని కేటీఆర్ అన్నారు. కానీ చెడు పనులు చేయాలంటే.. ఎలాంటి అడ్డంకులు ఉండవని చెప్పారు. రూపాయి పెట్టుబడితో.. రూపాయిన్నర రాబడి వచ్చేలా ఆలోచించాలని.. కేటీఆర్ అన్నారు. దళిత బంధుతో వ్యాపారాలు చేస్తామని లబ్ధిదారులు చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. కొన్ని కుటుంబాలు కలిసి.. వ్యాపారం చేసుకుంటే.. చాలా లాభం ఉంటుందని సూచించారు. దళిత బంధు తరహా పథకం కేవలం ఎస్సీలకే కాదని.. మిగతా వర్గాలకు కూడా ఇస్తామని కేటీఆర్ అన్నారు. సమాజంలో ఉన్నవి రెండే కులాలు అని.. పేద కులం, ధనిక కులం వ్యాఖ్యానించారు. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే తాను రాను అని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు దళితబంధు పథకాన్ని విజయవంతం చేసే బాధ్యతను తీసుకోవాలని కోరారు.

'దళితబంధు నిధులతో కొందరు ఒకే రకమైన వ్యాపారాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి వ్యాపారం చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతారు. ఆ వైపుగా ఆలోచించాలి. సంపదను సృష్టించుకోవాలి. ఎస్సీలనే కాదు, మిగతా వర్గాలను ఆదుకుంటాం. కొత్త ఆలోచనలు చేసి దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి.' అని కేటీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్ చిన్న పనులు చేసే వ్యక్తి కాదని.. కేటీఆర్ అన్నారు. సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తి అని వ్యాఖ్యానించారు. మనం కులం, మతం గొడవలు అంటూ అక్కడే ఉన్నామని కేటీఆర్ అన్నారు. 1987లో భారత్‌, చైనా రెండింటి జీడీపీ 470 బిలియన్ డాలర్లు అని కేటీఆర్ అన్నారు. ఈ 35 ఏళ్లలో యూరప్‌, జపాన్‌తో చైనా పోటీపడిందని గుర్తు చేశారు. కులం, మతం జోలికెళ్లకుండా పెట్టుబడులకు పోటీ పడితే.. ఫలితం అలా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు భారతదేశ జీడీపీ 2.93 ట్రిలియన్‌ డాలర్లు ఉందని.., అదే చైనాది చూసుకుంటే.. జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లుదా ఉందన్నారు. మన దేశంలో తలసారి ఆదాయం రూ.2వేల డాలర్లుగా ఉందని కేటీఆర్ తెలిపారు. చైనా తలసరి ఆదాయం రూ.14వేల డాలర్లుగా ఉందన్నారు. కులం, మతం గొడవలంటూ అక్కడే ఉన్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముందుకు వెళ్లి.. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్