Weather Report: వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు..-light to moderate rains to occur in isolated places in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Light To Moderate Rains To Occur In Isolated Places In Telangana

Weather Report: వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు..

HT Telugu Desk HT Telugu
Jun 01, 2022 05:14 PM IST

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు ఇవాళ, రేపు వర్ష సూచన ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది.  ఇక హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల, ఈదురుగాలుల [గాలివేగం గంటకు 10 నుంచి 20 కి. మీ] తో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అకాశం మేఘావృతమైన ఉంటుందని పేర్కొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

జిల్లాల్లోనూ వర్షాలు...

యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు కూడా ఇదే పరిస్థితి పడొచ్చని పేర్కొంది.

ఉష్ణోగ్రతలు ఇలా...

ఇవాల పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా దాటాయి. అత్యధికంగా నల్గొండ, ఖమ్మ జిల్లాలో 42డిగ్రీలుగా నమోదైంది. ఇక ఆదిలాబాద్, భద్రాచలం, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

మరోవైపు నైరుతి రుతుపవనాలు కేరళను తాకటంతో జూన్ 1 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక రుతుప‌వ‌నాల కార‌ణంగా రానున్న ఐదు నుంచి ఏడు రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఒక మోస్తారు వ‌ర్షం ప‌డొచ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇందుకు అరేబియా స‌ముద్రం నుంచి వీచే ప‌శ్చిమ గాలులు సహ‌క‌రిస్తాయ‌ని వెల్ల‌డించింది. 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్