Komatireddy : ఎమ్మెల్యే పదవికి కోమటి రెడ్డి రాజీనామా…. స్పీకర్ అమోదం-komatireddy rajagopal reddy resigned and speaker accepted resignation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Komatireddy Rajagopal Reddy Resigned And Speaker Accepted Resignation

Komatireddy : ఎమ్మెల్యే పదవికి కోమటి రెడ్డి రాజీనామా…. స్పీకర్ అమోదం

B.S.Chandra HT Telugu
Aug 08, 2022 11:14 AM IST

ఎట్టకేలకు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారు. గత వారం పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సోమవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను అమోదింప చేసుకుంటానని కోమటిరెడ్డి చెబుతున్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా
మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా

ఎమ్మెల్యే పదవికి మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసర రెడ్డికి రాజగోపల్‌ రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామాను స్పీకర్ అమోదించారని కోమటిరెడ్డి చెబుతున్నారు. స్పీకర్‌ కార్యాలయం కూడా కోమటిరెడ్డి రాజీనామాను అమోదిస్తున్నట్లు ప్రకటించింది. రాజీనామా తర్వాత గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు చెప్పారు.

తెలంగాణలో అరాచక పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని, సొంత రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసిఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తుందని కోమటిరెడ్డి ఆరోపించారు. తాను రాజీనామ చేస్తున్నానని చెబితే కేసిఆర్ దిగి వస్తున్నారన్నారు రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారన్నారు. తెలంగాణకు కేసిఆర్ నుంచి విముక్తి కల్పిస్తారన్నాన్నారు. కేసీఆర్‌‌కు పడుకున్నా, లేేచినా మునుగోడు ప్రజలు గుర్తు రావాలన్నారు.

తనను గెలిపించినందుకు మునుగోడు ప్రజలు పాపం చేశారా అని రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. అభివృద్ది కోసం కేసిఆర్‌ను కలవాలని చూస్తే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరని చెప్పారు.

మునుగోడు ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో రాజీనామ చేసి తీర్పు కోరుతున్నట్లు చెప్పారు. ధైర్యం లేకపోతే తాను రాజీనామా చేసే వాడిని కాదన్నారు. తనపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉందన్నారు. నిరుద్యోగుల కోసం, ప్రజలకు వైద్యం కోసం, పేదలకు ఇళ్ల కోసం, అర్హులకు పెన్షన్‌ల కోసం రాజీనామా చేసినట్లు చెప్పారు.

తాను రాజీనామ ప్రకటించగానే గట్టుప్పల్ మండలం వచ్చిందని, సీఎం కేసీఆర్‌కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని తాము చెప్పలేదని, లక్ష రుపాయల రుణ మాఫీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో వరి కొనలేమని చేతులు ఎత్తేశారరని, మిషన్ భగీరథలో 25వేల కోట్లు దోచుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని, గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం లేదని విమర్శించారు. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ అమోదించిన నేపథ్యంలో ఉపఎన్నికల అనివార్యం కానుంది. త్వరలోనే ఉపఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

IPL_Entry_Point

టాపిక్