Hyderabad Metro : మెట్రో విస్తరణ.. ఎక్కడ వరకు అంటే?-kcr to lay foundation for airport express metro corridor on december 9 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr To Lay Foundation For Airport Express Metro Corridor On December 9

Hyderabad Metro : మెట్రో విస్తరణ.. ఎక్కడ వరకు అంటే?

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 04:51 PM IST

Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం జరగనుంది.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో (twitter)

భాగ్యనగరంలో మెట్రో రైలు(Metro Rail) విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. రెండో దశ పనులకు డిసెంబర్ 9న శ్రీకారం చుట్టనున్నారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్(mind space to shamshabad airport) వరకు మెట్రో నిర్మించనున్నారు. 31 కిలోమీటర్లు ఉండగా.. 6 వేల 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్(KTR) ట్వీట్ చేశారు. రెండో దశ పనులకు డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) శుంకుస్థాపన చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్ వరకు 31 కిలో మీటర్ల మేర మెట్రో రైలు పనులు జరగనున్నాయి. మొత్తం రూ.6250 కోట్ల రూపాయలతో ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో వెళ్లనుంది. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) విస్తరణపై గతంలోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రీత్ సింగ్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నిధులను కేటాయించాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా.. విస్తరణ పనులు చేపడతామని స్పష్టం చేశారు.

రెండో దశ పనులు పూర్తయి.. మెట్రో అందుబాటులోకి వస్తే.. ఎయిర్ పోర్టు(Air Port) వెళ్లేవారికి ప్రయాణం సులభం కానుంది. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు కూడా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా రావొచ్చు. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా.. పనులు చేస్తామని కేటీఆర్ మాత్రం స్పష్టం చేశారు. పీపీపీ(PPP) విధానాన్నే అనుసరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శంకుస్థాపనం సందర్భంగా డిసెంబర్ 9న ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు బీహెచ్ఎల్(BHEL) టూ లక్డీకాపూల్ మెట్రో మార్గంపై క్లారిటీ రావాల్సి ఉంది. డిసెంబర్ 9న శంకుస్థాపనలో భాగంగా పనులు చేపడతారా? లేదంటే తర్వాత ప్రత్యేకంగా చేస్తారా తెలియాల్సి ఉంది. ఎల్బీ నగర్ టూ నాగోల్(LB Nagar To Nagole) వరకూ మెట్రోపైనా స్పష్టత రావాల్సి ఉంది. మెట్రో ప్రయాణం వైపు ప్రజలు కూడా మెుగ్గుచూపుతున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా గమ్యస్థానానికి చేరుతున్నారు. ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకుంటున్నారు. కరోనా ముందు కంటే.. ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇక ఎయిర్ పోర్ట్ వైపు పూర్తయితే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో(Air Port Express Way) మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. మరో 31 కిలో మీటర్ల పనులపై కేంద్రానికి డీపీఆర్ సమర్పించామన్నారు. బీహెచ్ఈఎల్ టూ లక్డీకాపూల్ 26 కిలోమీటర్లు, నాగోల్ టూ ఎల్బీనగర్ 5 కిలోమీటర్లకు సంబందించి డీపీఆర్ ఇచ్చామని తెలిపారు. కేటీఆర్ ట్వీట్ పై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎంజీబీఎస్-ఫలక్ నుమా కారిడార్ 2 పనులు ప్రారంభించాలని కోరారు. రూ.500 కోట్లతో 5.5 కిలోమీటర్ల కారిడార్ పూర్తి చేయాలన్నారు.

IPL_Entry_Point